Abn logo
May 19 2020 @ 00:31AM

మదుపరి మండే

 • మార్కెట్‌ను మెప్పించని ప్యాకేజీ 
 • సెన్సెక్స్‌ 1,069 పాయింట్లు పతనం
 • రూ.3.65 లక్షల కోట్లు గల్లంతు

ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనల ప్యాకేజీ స్టాక్‌ మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయింది. దాంతో దలాల్‌స్ట్రీట్‌లో మరో ‘బ్లాక్‌ మండే’ నమోదైంది. ఆర్థిక సేవలు, ఆటో షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు దాదాపు 6 వారాల కనిష్ఠ స్థాయికి పతనమయ్యాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 1,068.75 పాయింట్లు (3.44 శాతం) నష్టపోయి 30,028.98 వద్దకు జారుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 313.60 పాయింట్లు (3.43 శాతం)కోల్పోయి 8,823.25 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో పయనించినా, దేశీయ సూచీలు భారీ నష్టాలు నమోదు చేసుకోవడం గమనార్హం. సాధారణంగా గ్లోబల్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ట్రెండ్‌కు అనుగుణంగా మన సూచీలు గమనాన్ని నిర్దేశించుకుంటుంటాయి. కానీ, ఐదు విడతల్లో ప్రకటించిన ఉద్దీపన చర్యలపై ఆర్థికవేత్తలు, విశ్లేషకులు పెదవి విరిచారు. దేశంలో కరోనా వైరస్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతుండటం కూడా మదుపర్లను కలవర పెడుతోంది. మార్కెట్‌ పతనానికి సంబంధించి మరిన్ని అంశాలు.. బంగారం ఆల్‌టైం రికార్డు 

రూ.48,000కు చేరువలో తులం రేటు  


పసిడి ధరలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం (జూన్‌ కాంట్రాక్టు) ధర ఒక శాతం పైగా పెరిగి రూ.47,961కు చేరుకుంది. కేజీ వెండి ధర దాదాపు 5 శాతం పుంజుకుని రూ.48,999గా నమోదైంది. అంతర్జాతీయంగా ధరలు దాదాపు 8 ఏళ్ల (2012 అక్టోబరు) నాటి గరిష్ఠానికి చేరుకోవడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 1,759.98 డాలర్లు, వెండి 17.28 డాలర్లు పలికింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, ఆర్థిక మాంద్యం అంశాలపై భయాందోళనలు పెరగడం ఇందుకు ప్రధాన కారణమైంది. దేశీయంగా చూస్తే.. మార్చిలో రూ.38,500 స్థాయికి తగ్గిన బంగారం ధరలు గడిచిన రెండు నెలల్లో 24.5 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 16 శాతం పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా బులియన్‌ స్పాట్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ జరగట్లేదు. ఆభరణాల దుకాణాలు మూసి ఉన్నందున రిటైల్‌ విక్రయ ధరలూ అందుబాటులో లేవు. 


 1. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 28 నష్టాలు చవిచూశాయి. అన్నింటికంటే అధికంగా ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 10 శాతం పైగా నష్టపోయింది. 
 2. అలా్ట్రటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 7 శాతం పైగా క్షీణించాయి. ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో 6 శాతం పైగా తగ్గాయి. 
 3. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఇంట్రాడేలో 1.58 శాతం వరకు బలపడినప్పటికీ.. చివర్లో 1.25 శాతం నష్టంతో రూ.1,440.65 వద్ద ముగిసింది. 
 4. టీసీఎస్‌ 2.72 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలవగా.. ఇన్ఫోసిస్‌ 1.73 శాతం పెరిగింది. 
 5. బీఎ్‌సఈలో ఐటీ, టెక్నాలజీ మినహాయిస్తే, మిగతా రంగ సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. బ్యాంకెక్స్‌ సూచీ అత్యధికంగా 6.69 శాతం, ఫైనాన్స్‌ 6.65 శాతం కోల్పోయాయి. 
 6. బ్లూచి్‌పలతో పాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీ షేర్లూ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 3.87 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.92 శాతం తగ్గాయి.
 7. అమ్మకాల పోటులో మార్కెట్‌ మదుపర్ల సంపద రూ.3.65 లక్షల కోట్లకు పైగా తరిగిపోయింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీలన్నింటి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,19,00,649.71 కోట్లకు జారుకుంది. 
 8. డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 33 పైసలు బలహీనపడి 75.91కి చేరుకుంది.


ఆర్‌ఐఎల్‌ రైట్స్‌ ఇష్యూకు వాయిదాల్లో చెల్లింపులు 

రైట్స్‌ ఇష్యూలో పాల్గొనే షేర్‌హోల్డర్లకు సబ్‌స్ర్కిప్షన్‌ చెల్లింపుల్లో వెసులుబాటు కల్పిస్తున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. ప్రస్తుతం ఇష్యూ ధరలో 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని, మిగతాది రెండు వాయిదాల్లో (వచ్చే ఏడాది మేలో మరో 25 శాతం, నవంబరులో 50 శాతం) చెల్లించేందుకు అవకాశం కల్పించింది. రూ.53,125 కోట్ల ఆర్‌ఐఎల్‌ మెగా రైట్స్‌ ఇష్యూ ఈ నెల 20న ప్రారంభమై జూన్‌ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా వాటాదారులకు ప్రస్తుతం కలిగి ఉన్న ప్రతి పదిహేను షేర్లకు గాను ఒక షేరును రూ.1,257కు ఆఫర్‌ చేయనున్నారు.


ఎస్‌ఎంఈలకు లిస్టింగ్‌ ఫీజు 25శాతం తగ్గింపు 

కరోనా సంక్షోభ కాలంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎ్‌సఎంఈ)కు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ సైతం బాసటగా నిలిచాయి. వాటి ఎస్‌ఎంఈ ఫ్లాట్‌ఫామ్‌కు సంబంధించి వార్షిక లిస్టింగ్‌ ఫీజును 25 శాతం తగ్గించాలని నిర్ణయించాయి. ఇప్పటికే ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్టైన కంపెనీలతోపాటు త్వరలో లిస్ట్‌ అయ్యేందుకు వేచిచూస్తున్న కంపెనీలకు సైతం ఫీజు తగ్గింపు వర్తిస్తుందని బీఎ్‌సఈ స్పష్టం చేసింది. 


Advertisement
Advertisement
Advertisement