ఎదురొచ్చి స్వాగతం.. వేడుకగా సాగిన పాదయత్ర

ABN , First Publish Date - 2021-12-04T05:09:38+05:30 IST

‘అందరి కోసం భూములు త్యాగం చేసి, న్యాయం కోసం దేవుడి సన్నిధికి వెళుతున్న మీకు తప్పక న్యాయం జరుగుతుంది. మీ ఉద్యమానికి మా అండదండలు తప్పక ఉంటాయి’.

ఎదురొచ్చి స్వాగతం..  వేడుకగా సాగిన పాదయత్ర
సైదాపురం వీధుల్లో పాదయాత్ర

33వ రోజు కూడా తగ్గిన హుషారు

తురిమెర్లలో శంఖనాదంతో ప్రారంభం

అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు

యాత్రలో పాల్గొన్న బీజేపీ జాతీయ నేత 

డ్రమ్ము వాయిస్తూ ఉత్సాహం నింపిన కురుగొండ్ల

కాలు కలిపిన కోడెల తనయుడు


‘అందరి కోసం భూములు త్యాగం చేసి, న్యాయం కోసం దేవుడి సన్నిధికి వెళుతున్న మీకు తప్పక న్యాయం జరుగుతుంది. మీ ఉద్యమానికి మా అండదండలు తప్పక ఉంటాయి’. అంటూ పూలవర్షం కురిపిస్తూ  మహా పాదయాత్రకు దారిపొడవునా ప్రజలు ఘనస్వాగతం  పలికారు. ప్రజల ఆదరణకు అమరావతి రైతులు సంబరపడిపోయారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ డ్రమ్ము వాయిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. మాజీ స్పీకర్‌, దివంగత కోడెల శివప్రసాద్‌ తనయుడు శివరామ్‌ తన తండ్రి ఫొటోలతో పాదయాత్రలో పాల్గొన్నారు. తుళ్లూరుకు చెందిన వృద్ధుడు మాధవ్‌(70) పాదయా త్ర ఆరంభం నుంచి అన్నం తినకుండా పండ్లు తింటూ, నిమ్మరసం తాగుతూ శ్రీరామ.. జయరామ.. జయజయ రామా.. అంటూ  కొనసాగుతున్నాడు. కుమారి అనే మహిళా రైతుకు  నీటిగుంటలో పడి  చేతికి గాయమై నా,  కట్టుకట్టుకుని పాదయాత్రలో కొనసాగింది. సైదాపురంలో ఐదో తరగతి చదువుతున్న సరిత అమరావతి రైతులను కలిసి, జెండా పట్టుకుని ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేస్తూ సంఘీభావం తెలిపింది.  పాదయాత్రకు పలు గ్రామాల రైతులు ఎదురొచ్చి  ఘన స్వాగతం పలికారు.


సైదాపురం, డిసెంబరు 3: పలు అడ్డంకులు ఎదుర్కొ న్న అమరావతి రైతుల మహాపాదయాత్ర 33వ రోజు శుక్రవారం జోరుగా, హుషారుగా సాగింది. దారి పొడవునా ఎదురొచ్చిన వివిధ గ్రామాల రైతులు రాజధాని  పాదయా త్రీకులకు ఘన స్వాగతం పలికారు. వెంకటగిరి నియోజక వర్గ పరిధిలోని తురిమెర్లలో మహా పాదయాత్ర శంఖనా దంతో ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటలకు ప్రారం భమైన మహాపాదయాత్ర గిద్దలూరు రోడ్డు, ఊటుకూరు, జోగిపల్లిరోడ్డు, పొక్కందలరోడ్డు, మొలకలపూండ్లరోడ్డు మీదుగా సైదాపురం వరకు సాగింది. సైదాపురంలో రాత్రి బసకు ఆగింది.  మొలకలపూండ్ల రోడ్డు వద్ద మధ్యాహ్న భోజనానికి చేరుకున్నారు. భోజనం అనంతరం సైదాపురం చేరింది. మొలకలపూండ్ల రోడ్డు వద్దకు రాయలసీమ నుం చి భారీగా వాహనాలలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌తోపాటు మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర నాయకులు కోలా ఆనంద్‌, దినకర్‌, శ్రీనివాస్‌, రమేష్‌ నాయుడు, దయాకర్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ఆర్‌ నాయుడు  చేరుకు ని సంఘీభావం తెలిపి, సైదాపురం వరకు  యాత్రతోపా టు నడిచారు. గ్రామాల నుంచి అధిక సంఖ్యలో  రైతులు పాల్గొని మహాపాదయాత్రకు బ్రహ్మరఽథం పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కట్టా మోహన కృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంటు జిల్లా రైతు నాయకులు కొండూరు సుబ్రహ్మణ్యంరాజు,  ఇతర నాయకులు పావు లూరి పార్ధసారధి, మేడికొండ రమణయ్యనాయుడు, సుబ్ర హ్మణ్యంనాయుడు, దశయ్యనాయుడు, వల్లూరు ప్రభాకర్‌, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



ఇంగితజ్ఞానం లేకపోవడం దురదృష్టం 

- సత్యకుమార్‌


 ఏపీ సీఎంకి కొంచమైనా ఇంగితజ్ఞానం లేకపోవడం దురదృష్టకరమని  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. మొలకలపూండ్ల వద్ద ఆయన మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే బెంగళూరు, హైదరాబాదు, తాడేపల్లి, వైజాగ్‌లో ప్యాలెస్‌లు కట్టుకోవడం కాదన్నారు.  త్వరలోనే ప్రజలు నీకు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.  అమరావతినే రాజధానిగా కచ్చితంగా ఉంటుందని, రైతులకు బీజేపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.


రాజకీయ జీవితాన్ని సమాఽధి చేస్తారు : జేఏసీ 

 మంత్రి పదవి పొందేందుకు, ఉన్న పదవిని కాపాడుకునేందు  యత్నిస్తున్న నేతల రాజకీయ జీవితా న్ని ప్రజలు సమాధి చేస్తారని అమరావతి జేఏసీ నేతలు తెలిపారు.  పాదయాత్ర ముగిశాక సైదాపురంలో  వారు విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రజలే మీ పాలనను దు య్యపడుతున్నారన్నారు. ఇకనైనా మంచి మసుతో ఆలోచించాలన్నారు. మూడు రాజధానులు పెట్టి ఏం చేశారో మంత్రి బాలినేని చెప్పాలన్నారు.  నిరాహారదీక్షలు, రోడ్లపై బసలతోనైనా ముందుకు సాగుతామన్నారు. 


నేటి యాత్ర ఇలా..


 శనివారం ఉదయం 9గంటలకు సైదాపురం నుంచి  మహాపాదయాత్ర ప్రారంభమై గూడూరు నియోజవర్గం లోని తిప్పవరప్పాడు నుంచి కందలి, చెమర్తిల మీదుగా పుట్టంరాజుకండ్రిగ వరకు సాగుతుందని జేఏసీ నేతలు పేర్కొన్నారు.



Updated Date - 2021-12-04T05:09:38+05:30 IST