Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీపీటీ రకం కొనుగోలుకు సాంకేతిక సమస్య

 కంప్యూటర్‌లో ఆప్షన్‌ లేక ఇక్కట్లు 

 ఆప్షన్‌ ఇప్పించాలని తహసీల్దార్‌ను కోరిన సొసైటీ సీఈవోలు

తిరువూరు, డిసెంబరు 6: మండలంలో రైతులు ఎక్కువగా బీపీటీ(సాంబ)రకం ధాన్యం పండించారని, కొనుగోలు కేంద్రాల్లో 1061 రకం కొనుగోలు మాత్రమే నమోదు అవుతొందని, బీపీటీ రకం నమోదుకు కంప్యూటర్‌లో ఆప్షన్‌ ఇవ్వలేదని సొసైటీల  సీఈవోలు తహసీల్దార్‌ నరసింహారావుకు తెలిపారు. రెవెన్యూ కార్యాలయంలో మండలంలోని సొసైటీల సీఈవోలతో ధాన్యం కొనుగోలుపై తహసీల్దార్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు.  రైతులు బీపీటీ రకం ధాన్యం తెస్తే ఏ మిల్లుకు ధాన్యం కేటాయించాలో తెలియడం లేదని, 1061, బీపీటీ రకాలకు కొనుగోలు కేంద్రంలో చెల్లించే ధర దాదాపు సమానమే అయినా మిల్లరు బీపీటీ రకాన్ని దిగుమతి చేసుకునేందుకు సుముఖత చూపడం లేదని సీఈవోలు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద కంప్యూటర్లలో బీపీటీ ధాన్యం కొనుగోలుకు అవకాశం కల్పించేలా చూడాలని కోరారు. ఆర్బీకేలకు అవసరమయిన గన్నీ బ్యాగులు, కొనుగోలు కేంద్రాల వద్ద కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. సివిల్‌ సప్లయిస్‌ డీటీ శ్వేత పాల్గొన్నారు.


Advertisement
Advertisement