భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం (జనవరి 25) ప్రకటించింది. 2021 ఏడాదికి పద్మ విభూషణ్-7, పద్మ భూషణ్-10, పద్మ శ్రీ-102.. మొత్తంగా 119 మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పద్మ అవార్డులలో ఇద్దరు ప్రముఖ సింగర్స్ ఉండటం విశేషం. ఆర్ట్ కేటగిరీలో తమిళనాడు రాష్ట్రం తరుపున దివంగత లెజెండ్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మ విభూషణ్ అవార్డ్కు ఎన్నికవగా.. మరో ప్రముఖ గాయకురాలు కె.ఎస్. చిత్ర.. కేరళ రాష్ట్రం తరుపున పద్మ భూషణ్కు సెలక్ట్ అయ్యారు. ఇంకా పలువురు ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి.