Padma Vibhushan బాబాసాహెబ్ పురందరే కన్నుమూత

ABN , First Publish Date - 2021-11-15T13:03:34+05:30 IST

పద్మ విభూషణ్ బాబాసాహెబ్ పురందరే సోమవారం ఉదయం 5 గంటలకు పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో మరణించారు....

Padma Vibhushan బాబాసాహెబ్ పురందరే కన్నుమూత

పూణే (మహారాష్ట్ర): పద్మ విభూషణ్ బాబాసాహెబ్ పురందరే సోమవారం ఉదయం 5 గంటలకు పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 99 ఏళ్లు.పూణెలోని వైకుంఠ శ్మశాన వాటికలో సోమవారం ఉదయం 10.30 గంటలకు పురందరే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.చరిత్రకారుడు, రచయిత బాబాసాహెబ్ పురందరే శనివారం బాత్రూంలో పడిపోవడంతో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు.బాబాసాహెబ్ పురందరే ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, రంగస్థల కళాకారుడు.


ఇతను ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై రాసిన నాటకంతో ప్రసిద్ధి చెందారు.ఈయన శివాజీ కాలం నుంచి రాజు, అతని పరిపాలన, కోటలపై పలు పుస్తకాలు రాశారు. బాబాసాహెబ్ పురందరే ఛత్రపతి జీవితంపై రాసిన నాటకం ‘జాంత రాజా’కి కూడా ఆయన దర్శకత్వం వహించారు.పురందరేకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషణ్ అవార్డును ప్రదానం చేసింది. 2019లో పురందరే భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు.


Updated Date - 2021-11-15T13:03:34+05:30 IST