Advertisement
Advertisement
Abn logo
Advertisement

రామావతారంలో పద్మావతీ దేవి

నేడు అమ్మవారికి గజ వాహనసేవ తిరుచానూరు, డిసెంబరు 3: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవ జరిగింది. ఆలయం నుంచి ఉత్సవమూర్తిని వాహన మండపానికి వేంచేపు చేసి కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. ఒక చేతిలో, మరో చేతిలో త్రిదండంతో గోవులను పాలిస్తున్న రాజగోపాలుడి అలంకారంలో అమ్మవారిని వాహనంపై అధిష్టింప చేశారు. మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం అద్దాల మండపం నుంచి వాహన మండపానికి వేంచేపు చేసి హనుమంత వాహనంపై పట్టాభిరాముడిగా అలంకరించి అమ్మవారిని ఆశీనులను చేశారు. ఈ కార్యక్రమంలో జీయర్‌ స్వాములు, రాష్ట్రమంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాక్‌రెడ్డి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకుడు బాబుస్వామి, ఏవీఎస్వో వెంకటరమణ, ఆలయ సూపరింటెండెంట్లు మధుసూదన్‌, శేషగిరి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ జయకుమార్‌, దాము తదితరులు పాల్గొన్నారు. శనివారం ఉదయం పల్లకి ఉత్సవం, సాయంత్రం కేటీ మండపంలో వసంతోత్సవం, రాత్రికి గజవాహనసేవ జరగనుంది. 

కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై పద్మావతీదేవి


Advertisement
Advertisement