పైడితల్లమ్మ జాతరకు వేళాయె

ABN , First Publish Date - 2020-10-25T10:44:29+05:30 IST

ఉత్తరాంధ్రుల కల్పవల్లి.. విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి సమయం సమీపిస్తోంది.

పైడితల్లమ్మ జాతరకు వేళాయె

 రేపు తొలేళ్లు 

మంగళవారం సిరిమాను సంబరం

 కొవిడ్‌ నిబంధనల నడుమ ఏర్పాట్లు


విజయనగరం రూరల్‌, అక్టోబరు 24: ఉత్తరాంధ్రుల కల్పవల్లి.. విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి సమయం సమీపిస్తోంది. సోమవారం తొలేళ్లు సంబరం నిర్వహించనుండగా.. మంగళవారం సిరిమాను జాతరకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళవారం పూర్తిగా లాక్‌డౌన్‌ని అమలు చేయాలని నిర్ణ యించారు. ఆ రోజున ఉదయం మాత్రమే భక్తు ల దర్శనానికి పాస్‌లను జారీ చేశారు. సిరిమా నోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ శనివారం అమ్మవారి దేవస్థానం అధికారులతో పాటు, పోలీసు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. అం తకుముందు ఆయన హుకుంపేటలోని సిరి మాను తయారు చేసే ప్రాంతానికి వెళ్లారు. పూజారి బంటుపల్లి వెంకటరావుతోనూ మాట్లా డారు. తోలేళ్లు, సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని... అదే క్రమంలో కరోనా నిబంధ నలు ప్రతి భక్తుడు పాటించే విధంగా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సకాలంలో సిరిమాను తిరిగేందుకు సహకరించాలన్నారు. ఉత్సవ నిర్వహణకు ఇద్దరు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది.  


పట్టు వస్త్రాలను సమర్పించనున్న మంత్రి బొత్స

పైడిమాంబ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలను అందజేస్తారు. సిరిమానోత్సవం రోజున ఉదయం అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పాటు ఉత్తరాం ధ్రలోని ఎంపీలు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకోనున్నారు. 


ఇంటి నుంచే సిరిమానోత్సవాన్ని వీక్షించాలి : డీఐజీ

సిరిమానోత్సవానికి బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా వ్యాప్తిపై భక్తుల్లో అవగాహన కల్పించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు సూచిం చారు. సిరిమానోత్సవ నిర్వహణకు భద్రత ఏర్పాట్లపై విజయ నగరం జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలేళ్లు.. సిరిమానోత్సవంలో తొలిసారిగా గ్రామ, వార్డు మహిళా సంరక్షణ పోలీసుల సేవలను వినియోగిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా ఇంటికే పరిమితమవ్వాలని.. టీవీల్లోనే సిరిమానోత్సవాన్ని తిలకించి ఆరో గ్యాన్ని కాపాడుకోవాలని వివరించాలన్నారు. 

Updated Date - 2020-10-25T10:44:29+05:30 IST