ఉద్యమ నాయకురాలు పైల చంద్రమ్మ ఇకలేరు

ABN , First Publish Date - 2020-09-24T18:37:55+05:30 IST

ఉద్యమగళం మూగబోయింది. సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకురాలు, శ్రీకాకుళం..

ఉద్యమ నాయకురాలు పైల చంద్రమ్మ ఇకలేరు

విశాఖ కేజీహెచ్‌లో అనారోగ్యంతో మృతి


(పలాస/శ్రీకాకుళం): ఉద్యమగళం మూగబోయింది. సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకురాలు, శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాట యోధురాలు పైల చంద్రమ్మ (72) అనారోగ్యంతో మృతి చెందారు. నాటి ఉద్యమాల్లో ఈమె చురుగ్గా వ్యవహరించి.. ఎందరికో పోరాట స్ఫూర్తిగా నిలిచారు. ఆదివాసి, దళిత, మత్స్యకార, మహిళా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ప్రధానంగా శ్రీకాకుళోద్యమంలో కీలకపాత్ర పోషించారు. భర్త పైల వాసుదేవరావు ఆనాటి పీపుల్స్‌వార్‌ వ్యవస్థాప కుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. పార్వతీపురం కుట్ర కేసులో కూడా ముద్దాయిగా ఉన్నారు. అనంతరం మర ణించే వరకూ ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు.


చంద్రమ్మ కూడా ఆయన బాటలోనే నడిచి అనేక ఉద్యమాలు చేప ట్టారు. జైలు జీవితాన్ని, అజ్ఞాతాన్ని అనుభవించారు. భూమి కోసం భుక్తి కోసం విముక్తికోసం ఆమె చేసిన పోరా టాలు ఉద్దానంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సహ చర మిత్రురాలు పోతన్నపల్లి జయమ్మ ఇటీవల మృతి చెం దడంతో చంద్రమ్మ విచారంలో మునిగి అనా రోగ్యం పాల య్యారు. ఈ క్రమంలో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ.. బుధవారం రాత్రి ఆమె మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


ఉద్యమమే.. ఊపిరిగా..

చంద్రమ్మ జీవన పోరాటం.. ఉద్యమమే ఊపిరిగా సాగింది. 1948లో వజ్రపుకొత్తూరు మండలంలోని రాజాం లో ఆమె జన్మించారు.  బాల్యం నుంచి కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై అప్పటి నాయకులు గొరకల రాంబాబు, అం కమ్మ, చంద్రమ్మలు ఆ పార్టీలో చేరారు. 1968లో తెగింపు సంఘంలో చేరారు. 1969లో శ్రీకాకుళోద్యమంలో పాల్గొన్నారు. దళాలతో పనిచేసి చురుగ్గా  ఉండేవారు. 1972లో ఆమెతో దళాల మధ్యే పైల వాసుదేవరావుతో వివాహమైంది. 1975లో మందస మండలంలోని కొండలోగాంలో జరిగిన పోలీసు ఎదురుకాల్పుల్లో ఆమె గాయపడ్డారు. పార్వతీపురం సరిహద్దులో పోలీసు ఎన్‌కౌం టరులో ఆమె త్రుటిలో తప్పించుకున్నారు. అనంతరం కోవర్టు ఆపరేషన్‌లో ఆమె పోలీసులకు చిక్కిపోయారు. మందస పోలీస్‌స్టేషన్‌లో ఆమెకు చిత్రహింసలకు గురి చేసినా, పార్టీ రహస్యాలు బహిర్గతం చేయలేదు. అనంతరం 14 సంవత్సరాలపాటు జైలుజీవి తాన్ని గడి పారు.


ఎమర్జన్సీ తరువాత బెయిల్‌పై విడుదలై తెలంగాణ జిల్లాలో ఆమె పీపుల్స్‌వార్‌లో పనిచేశారు. ఆయుధాలతో దొరికిపోవడంతో ఆమెకు మళ్లీ జైలు తప్ప లేదు. జైలు జీవితాన్ని అనుభవించిన తరువాత పెరోల్‌పై వచ్చి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 72 సంవత్సరాల వయసులో కూడా పార్టీ కోసం అంకితభావంతో పని చేశారు. ప్రస్తుతం చంద్రమ్మ శ్రీకాకుళం జిల్లా సీపీఐ ఎం ఎల్‌ న్యూడెమోక్రసీ  బాధ్యురాలిగా, అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, జిల్లా కార్యదర్శిగా  వ్యవ హరిస్తున్నారు.  చంద్రమ్మ కుమార్తె అరుణ ప్రస్తుతం ఆమె మీడియా రంగంలో పని చేస్తున్నారు. 


నేడు విశాఖలో అంత్యక్రియలు

పైల చంద్రమ్మ మృతదేహానికి గురువారం విశాఖ పట్నంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వంకల మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మృతి బాధాకరమని, అత్యవసర సేవలు అందించినా ఆమెను బతికించుకోలేకపోయామని చెప్పారు. ఆమె మృతి పార్టీకి, శ్రీకాకుళ ఉద్యమానికి తీరని లోటన్నారు. 


ఉద్యమాలకు తీరని లోటు..

శ్రీకాకుళ సాయుధపోరాటంలో చంద్రమ్మ పాల్గొన్నారు. 14 సంవత్స రాలపాటు జైలుజీవితాన్ని అనుభించారు. జీవితాంతం మరణించేంతవరకూ న్యూడెమోక్రసిలోనే ఉంటూ ప్రజా పోరాటాలు సాగించారు. ఆమె మరణం ఉద్యమానికి తీరనిలోటు.

-పి.ట్యాన్యా, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసి, రాష్ట్ర కార్యదర్శి


చంద్రమ్మకు నివాళి

గుజరాతీపేట: చంద్రమ్మ మృతికి సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు సన్నశెట్టి రాజశేఖర్‌, జిల్లా అధ్యక్షుడు మార్పు మల్లేశ్వరరావులు నివాళులర్పించారు. శ్రీకాకుళం నేలపై సాగిన కీలక ఉద్యమాల్లో చంద్రమ్మ పాత్ర ఎనలేనిదని వారంతా గుర్తు చేసుకున్నారు.






Updated Date - 2020-09-24T18:37:55+05:30 IST