స్మార్ట్‌ఫోన్‌ విచ్చలవిడిగా వాడితే ఒళ్లు నొప్పులు!

ABN , First Publish Date - 2021-01-27T20:17:53+05:30 IST

మీరు స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి వాడుతున్నారా? ఫోన్‌ను వాడే క్రమంలో సరైన భంగిమలో కూర్చోవడం లేదా? అయితే తస్మాత్‌ జాగ్రత్త అని టర్కీలోని ఇస్తాంబుల్‌ యూనివర్సిటీ

స్మార్ట్‌ఫోన్‌ విచ్చలవిడిగా వాడితే ఒళ్లు నొప్పులు!

ఇస్తాంబుల్‌, జనవరి 26: మీరు స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి వాడుతున్నారా? ఫోన్‌ను వాడే క్రమంలో సరైన భంగిమలో కూర్చోవడం లేదా? అయితే తస్మాత్‌ జాగ్రత్త అని టర్కీలోని ఇస్తాంబుల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎలా కూర్చున్నామనే స్పృహ కూడా లేకుండా ఫోన్‌లో మునిగిపోయే వారిలో దాదాపు 70 శాతం మంది వీపు పైభాగంలో నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. ఒకరోజులో ఆరు గంటలకు మించి ఫోన్‌ను వాడే వారిలో.. 66 శాతం మందికి మెడనొప్పి, 57 శాతం మందికి భుజాల నొప్పులు వస్తున్నట్లు పేర్కొన్నారు. మణికట్టు, చేతుల నొప్పులకు కూడా ఫోన్‌ విచ్చలవిడి వాడకం కారణమవుతోందన్నారు. 


Updated Date - 2021-01-27T20:17:53+05:30 IST