సంతోషాలను జంటగా...

ABN , First Publish Date - 2021-01-30T05:30:00+05:30 IST

భార్యాభర్తల మధ్య కీచులాటలు సహజం. అయితే ఆ చిన్న పొరపొచ్చాలను వెంటనే మరచిపోయి తమ బంధాన్ని అందంగా

సంతోషాలను జంటగా...

భార్యాభర్తల మధ్య కీచులాటలు సహజం. అయితే ఆ చిన్న పొరపొచ్చాలను వెంటనే మరచిపోయి తమ బంధాన్ని అందంగా మలచుకొనేందుకు ప్రయత్నిస్తే జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. ఒకరినొకరు అర్థంచేసుకుంటూ పరస్పరం గౌరవించుకుంటుంటే గొడవలకు తావే ఉండదు.  ఆనందాల జంటగా నిలిచేందుకు ఏం చేయాలంటే...


దంపతులు ఏకాంతంగా గడపడానికి తమకంటూ సమయం కేటాయించుకోవాలి. అన్నీ మర్చిపోయి ఆ సమయాన్ని ఇద్దరూ ఆనందంగా గడపాలి.


 ఇద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుతూ ఉండొద్దు. ఇద్దరూ ఎవరి ఫోన్లలో వారు బిజీగా ఉంటే వారి ప్రేమబంధం బలహీనపడే అవకాశం ఉంది. 


 ఈరోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయక తప్పడం లేదు. దీంతో ఏకాంతంగా గడిపే సమయం చిక్కడం లేదు. అందుకే    చెట్టాపట్టాలేసుకువారంలో ఒకరోజైనా ఎక్కడికైనా వెళ్లాలి. అలా   ప్రేమగా గడపడం వల్ల ఆ వారమంతా ఉత్సాహంగా ఉంటారు. 


 ఎప్పుడూ సినిమాలు, షికార్లు కాకుండా అప్పుడప్పుడు సాహసయాత్రలు చేస్తుంటే ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఆ థ్రిల్లింగ్‌ అనుభవం వారిలో కొత్త నూతన విషయాలను జంటగా శోధించాలన్న కుతూహలాన్ని పెంచుతుంది. 


 అప్పుడప్పుడు ఒకరినొకరు ఆశ్చర్యపరిచే పనులు చేస్తూ ఒకరి పట్ల ఒకరికున్న  ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండాలి.  జీవితాంతం మరిచిపోలేని ఆనందాన్ని, అందమైన జ్ఞాపకాలను మూటగట్టుకోవాలి. ఇవన్నీ ఆలుమగల బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయనడంలో సందేహం లేదు.


 ఒకరు చేసిన పనులను ఒకరు ప్రశంసించుకుంటూ ఉండాలి. ‘ఎంత బాగా చేశావు’ అని భర్త అనే ఒక్క మాట భార్యను ఎంతో సంతోష పెడుతుంది. అప్పటి వరకూ ఆమె పడ్డ శ్రమను క్షణాల్లో మర్చిపోయేలా చేస్తుంది. ఇది బంధం మరింత బలపడేలా చేస్తుంది.


Read more