ఇక PAKలో రేపిస్టులకు విధించే శిక్ష ఇదే..

ABN , First Publish Date - 2021-11-19T01:49:46+05:30 IST

ఇక PAKలో రేపిస్టులకు విధించే శిక్ష ఇదే..

ఇక PAKలో రేపిస్టులకు విధించే శిక్ష ఇదే..

న్యూఢిల్లీ: అత్యాచారాలకు పాల్పడేవారిని లైంగికంగా పనికిరాకుండా చేసే కెమికల్ కాస్ట్రేషన్‌కు పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. నేరారోపణలను వేగవంతం చేయడానికి, కఠినమైన శిక్షలను విధించడానికి ఉద్దేశించిన కొత్త చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. పాకిస్తాన్‌లో బహుళ అత్యాచారాలకు పాల్పడిన లైంగిక నేరస్థులకు రసాయన కాస్ట్రేషన్‌ను విధిస్తారు. ఇటీవల దేశంలో మహిళలు, పిల్లలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో నేరాలను సమర్థవంతంగా అరికట్టాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ కొత్త అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌ను ఆమోదించిన దాదాపు ఏడాది తర్వాత బిల్లు ఆమోదం పొందింది. క్రిమినల్ లా (సవరణ) బిల్లు 2021 బిల్లుతో పాటు 33 ఇతర బిల్లులను పార్లమెంట్ ఉమ్మడి సెషన్ ఆమోదించింది. కోర్టు నిబంధనలు, మెడికల్ బోర్డు సూచనల ప్రకారం వ్యక్తి శరీరంలోకి రసాయనం ఎక్కిస్తారు. దీంతో ఆ వ్యక్తి లైంగికంగా పనికిరాకుండా పోతాడు.

Updated Date - 2021-11-19T01:49:46+05:30 IST