కశ్మీర్‌పై అగ్ర‌రాజ్యం జోక్యం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-22T13:37:44+05:30 IST

జమ్మూ కశ్మీర్‌ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసే అవకాశం వస్తే కశ్మీర్‌ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని హెచ్‌బీవో టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

కశ్మీర్‌పై అగ్ర‌రాజ్యం జోక్యం చేసుకోవాలి

టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో పాక్‌ ప్రధాని 

న్యూఢిల్లీ, జూన్‌ 21: జమ్మూ కశ్మీర్‌ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసే అవకాశం వస్తే కశ్మీర్‌ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని హెచ్‌బీవో టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అగ్రరాజ్యమైన అమెరికా తలచుకొంటే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ ఇమ్రాన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ కూడా కశ్మీర్‌పై జోక్యం చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.


పాక్‌ ప్రయత్నాలను భారత్‌ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోం ది. ఇమ్రాన్‌ తాజా వ్యాఖ్యలపై భారత్‌ ఇంకా స్పందించాల్సి ఉంది. మహిళలు కురచ దుస్తులు ధరిస్తే పురుషులపై దాని ప్రభావం ఉంటుందని, పురుషులు రోబోల మాదిరిగా ఉండలేరంటూ లైంగిక హింసపై ఇమ్రాన్‌ మళ్లీ నోరు జారారు. దీనిపై సోషల్‌ మీడియాలో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్‌లోని ప్రతిపక్ష పార్టీలు, జర్నలిస్టులు ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇమ్రాన్‌ ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు.

Updated Date - 2021-06-22T13:37:44+05:30 IST