మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి.. రాష్ట్రాలకు పాక్ ప్రధాని వినతి

ABN , First Publish Date - 2020-03-27T02:55:34+05:30 IST

కరోనా కట్టడి కోసం పాక్‌ను లాక్‌ డౌన్ చేయాడాన్ని పాక్ ప్రధాని తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అంతటి భారాన్ని మోసే ఆర్థిక శక్తి భారత్‌కు లేదని తొలినుంచీ చెబుతున్నారు. అయితే వ్యాధి తీవ్రత దృష్ట్యా పాక్‌లోని ప్రావిన్సులు వివిధ రకాల లాక్ డౌన్‌లు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రావిన్సుల ప్రభుత్వాలను లాక్ డౌన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు.

మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి.. రాష్ట్రాలకు పాక్ ప్రధాని వినతి

ఇస్లామాబాద్: ప్రపంచ దేశాల్లోని పలు ప్రభుత్వాలను కరోనా వైరస్ గొప్ప సందిగ్ధంలో పడేసింది. ఆర్థిక వ్యవస్థను కాపాడాలో.. మనుషుల ప్రాణాలను కాపాడాలో తేల్చుకోలేక పోతున్న డోనాల్డ్  ట్రంప్ వంటి వారి అవస్థ మనకు తెలిసిందే. మన పొరుగు దేశమైనా పాకిస్థాన్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా కట్టడి కోసం పాక్‌ లాక్‌ డౌన్‌ను పాటించాలన్న ప్రతిపాదనను ప్రధాని ఇమ్రాన్ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అంతటి భారాన్ని మోసే ఆర్థిక శక్తి పాక్‌కు లేదని చెబుతున్నారు. అయితే వ్యాధి తీవ్రత దృష్ట్యా పాక్‌లోని ప్రావిన్సులు వివిధ రకాల ఆంక్షలను విదిస్తున్నాయి. పూర్తి లాక్ డౌన్‌లోకి వెళ్లేందుకు కూడా కొన్ని ప్రావిన్సులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ ఆయా ప్రావిన్సుల ప్రభుత్వాలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు.

Updated Date - 2020-03-27T02:55:34+05:30 IST