Pak PM ఇమ్రాన్: ఇండియన్ ఎంబసీలు చాలా చురుకైనవి

ABN , First Publish Date - 2021-05-07T00:49:09+05:30 IST

ఇక ఇదే సందర్భంలో ఇండియన్ ఎంబసీల గురించి ఇమ్రాన్ ప్రస్తావిస్తూ ‘‘ఇండియన్ ఎంబసీలు చాలా గొప్పగా పని చేస్తున్నాయి. తమ స్వదేశానికి వారు ఎంతో పని చేస్తున్నారు. అలాగే విదేశాల నుంచి పెట్టుబడులు

Pak PM ఇమ్రాన్: ఇండియన్ ఎంబసీలు చాలా చురుకైనవి

ఇస్లామాబాద్: విదేశాల్లో ఉన్న భారతీయ అధికారులు తమ దేశ ప్రజల కోసం గొప్పగా పని చేస్తారని, కానీ పాకీస్తానీ అధికారులు అలా చేయడం లేదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గురువారం విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ ఎంబీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న భారత, పాకిస్తాన్ ఎంబసీలను పోల్చుతూ ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.


‘‘విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ అధికారులు సరిగా పని చేయడం లేదు. అన్ని పనుల్లో జాప్యం, అనవసరమైన ఉదారత వారిలో కనిపిస్తోంది. సౌది అరేబియాలో ఉన్న ఎంబసీ అధికారులు అసులు పని చేయడమే లేదని నాకు రిపోర్ట్ అందింది. ఇక కువైట్‌లో ఉన్న ఎంబసీ అధికారులు ప్రజలకు సరైన నియమాల గురించి చెప్పడం మానేసి లంచాలకు అలవాటు పడ్డారు. ఇందులో సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. ఈ రిపోర్ట్‌లు చదివి చాలా షాక్ అయ్యాను’’ అని ఇమ్రాన్ అన్నారు.


ఇక ఇదే సందర్భంలో ఇండియన్ ఎంబసీల గురించి ఇమ్రాన్ ప్రస్తావిస్తూ ‘‘ఇండియన్ ఎంబసీలు చాలా గొప్పగా పని చేస్తున్నాయి. తమ స్వదేశానికి వారు ఎంతో పని చేస్తున్నారు. అలాగే విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడంలో వాళ్లు చాలా ముందున్నారు’’ అని అన్నారు.

Updated Date - 2021-05-07T00:49:09+05:30 IST