Afghanకి సాయం అందాలంటే మా ట్రక్కులు వాడాల్సిందే: PAK

ABN , First Publish Date - 2021-12-01T01:26:54+05:30 IST

ఆర్థికంగా, ఆరోగ్యంగా చితికిపోతున్న అఫ్ఘానిస్తాన్‌కు భారత్ చేయూత అందించనుంది. అయితే మానవతా దృక్పథంతో భారత్ అందిస్తున్న ఈ చేయుతను కూడా పాకిస్తాన్ వ్యాపార కోణానికి వాడుకోవాలని చూస్తోంది..

Afghanకి సాయం అందాలంటే మా ట్రక్కులు వాడాల్సిందే: PAK

ఇస్లామాబాద్: ఆర్థికంగా, ఆరోగ్యంగా చితికిపోతున్న అఫ్ఘానిస్తాన్‌కు భారత్ చేయూత అందించనుంది. అయితే మానవతా దృక్పథంతో భారత్ అందిస్తున్న ఈ చేయుతను కూడా పాకిస్తాన్ వ్యాపార కోణానికి వాడుకోవాలని చూస్తోంది. వాఘా సరిహద్దు ద్వారా భారత్ నుంచి అఫ్ఘానిస్తాన్‌కు పంపించే సరుకులను తమ ట్రక్కుల్లోనే పంపించాలని పాకిస్తాన్ మొండికేస్తోంది. అయితే భారత్ మాత్రం.. అయితే తమ ట్రక్కుల్లో లేదంటే అఫ్ఘాన్ ట్రక్కుల్లో వాటిని పంపిస్తామని తేల్చి చెప్పింది. వాస్తవానికి అఫ్ఘానిస్తాన్ ట్రక్కులు పాకిస్తాన్‌లో ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి. కానీ, పాకిస్తాన్ కొత్తగా తమ ట్రక్కుల్లోనే సరుకులు పంపాలని బెట్టు చేస్తోంది. అంతే కాకుండా ఈ రవానాపై షిప్‌మెంట్ చార్జీలు కూడా వసూలు చేయాలని భావిస్తోంది. మానవతా దృక్పథంతో చేస్తున్న కార్యానికి టాక్స్‌లు వసూలు చేయడమేంటని భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతోన్నాయి. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ద్వారా అఫ్ఘాన్ ప్రజలకు వీలైనంత త్వరగా సాయం అందేలా ఒక అవగాహనకు రావడానికి చర్చలు జరుగుతున్నాయి. వాఘా సిరహద్దు అఫ్ఘాన్‌కి పంపాల్సిన సహాయాన్ని భారత్ ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. పాక్ తన పంతాన్ని వీడితే వీలైనంత తొందరలో వాటిని అఫ్ఘాన్‌కి చేర్చవచ్చని భారత విదేశాంగ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-12-01T01:26:54+05:30 IST