ఐసీసీ జాబితాలో మా ర్యాంక్ బాలేదు.. పాక్ కెప్టెన్ అసంతృప్తి

ABN , First Publish Date - 2020-05-26T04:05:46+05:30 IST

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్థానం ఆమోదయోగ్యం కాదని పాక్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ అసంతృప్తి వెలిబుచ్చాడు.

ఐసీసీ జాబితాలో మా ర్యాంక్ బాలేదు.. పాక్ కెప్టెన్ అసంతృప్తి

ఇస్లాబామాద్: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్థానం ఆమోదయోగ్యం కాదని పాక్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ అసంతృప్తి వెలిబుచ్చాడు. ఏ ఫార్మాట్‌లోనూ పాక్ ర్యాంకింగ్ మెరుగ్గా లేదని, ఈ పరిస్థితి మార్చడానికి తాము ప్రయత్నిస్తామని అతను  చెప్పాడు. ‘ఐసీసీ జాబితాలో పాక్ ర్యాంక్ మెరుగు పరచడానికి సాధ్యమైనంతగా కష్టపడతాం. కొద్దిమంది సభ్యులపైనే ఆధారపడకుండా, మంచి జట్టును ఏర్పాటు చేయడంపై మేం దృష్టిపెట్టాలి’ అని బాబర్ ఆజమ్ స్పష్టంచేశాడు. ఐసీసీ అత్యుత్తమ జట్ల జాబితా ప్రకారం పాక్.. టెస్టుల్లో 7వ స్థానంలో, వన్డేల్లో 6వ స్థానంలో, టీ20ల్లో 4వ స్థానంలో ఉంది.

Updated Date - 2020-05-26T04:05:46+05:30 IST