Abn logo
Dec 4 2020 @ 14:54PM

కశ్మీర్‌లో మొదటిసారి ఓటేసిన పాకిస్తానీలు.. సంబరాలు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చిన శరణార్థులు తొలిసారిగా ఓటు వేశారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకు్న్నారు. అనంతరం డాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌లో ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులు ఎప్పుడూ పోలింగ్‌లో పాల్గొనలేదు. స్వాతంత్ర్యానంతర 70 ఏళ్ల ఎన్నికల చరిత్రలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు ఓటు వేయడం ఇదే తొలిసారి.


రాష్ట్రంలో తాజాగా జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్‌కు చెందిన శరణార్థులు ఓటు వేశారు. ఈ సందర్భంగా డాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘70 ఏళ్లలో మొట్టమొదటి సారి ఓటు హక్కు వినియోగించుకున్నాం. మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలతో మా కల సాకారమైంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఒక ఓటర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement