Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ విమానాన్ని అనుమతించేది లేదన్న పాక్..భారత్‌లో కలవరం!

ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్-షార్జా మధ్య నడిచే విమానాన్ని తమ దేశం గుండా అనుమతించేది లేదంటూ పాకిస్థాన్ తాజాగా ప్రకటించింది. వినియోగదారులకు టిక్కెట్టు రేట్లు అందుబాదటులో ఉండే విధంగా గో ఫస్ట్ సంస్థ ఈ సర్వీసును ప్రవేశపెట్టింది. గత నెలలోనే భారత్ హోం మంత్రి అమిత్ షా ఈ విమాన సేవలను ప్రారంభించారు. అయితే.. పాక్ తీసుకున్న నిర్ణయంతో ఈ సేవలు కొనసాగుతాయో లేదో అన్న భయాందోళనలు రేకెత్తుతున్నాయి. పాక్ అనుమతి నిరాకరణ కారణంగా ఈ విమానాన్ని మరోమార్గం గుండా నడపాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రయాణం సమయం గంట మేరకు పెరిగి, టిక్కెట్ చార్జీలు పెరిగే అవకాశం ఉండటంతో ఈ సర్వీసును మూలపెట్టొచ్చన అనుమానాలు పెరుగుతున్నాయి. కాగా.. 2009లో ప్రారంభమైన శ్రీనగర్-దుబాయ్ విమాన సర్వీసుకు కూడా పాక్ మోకాలడ్డడంతో విరమించుకోవాల్సి వచ్చింది. తాజా సర్వీసుకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement