Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 3 2021 @ 09:20AM

Afghanistanకు వెళ్లే భారత గోధుమల ట్రక్కులను అడ్డుకున్న పాక్

న్యూఢిల్లీ :భారత్ అప్ఘానిస్థాన్ దేశానికి పంపిస్తున్న గోధుమల లారీలను పాకిస్థాన్ అడ్డుకుంది. భారత్ గత నెలలో అఫ్ఘానిస్థాన్‌కు భూమార్గం ద్వారా ఆహార ధాన్యాల లారీలు పాకిస్థాన్‌కు చేరాయి. అఫ్ఘానిస్థాన్‌కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను తీసుకువెళ్లే ట్రక్కులను తరలించడానికి అనుమతించమని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు లేఖ పంపింది.తాలిబాన్ల పాలనకు గుర్తింపు ఇవ్వడం వల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచించాలని అంతర్జాతీయ సమాజం హెచ్చరించినప్పటికీ, అఫ్ఘానిస్థాన్ ప్రజలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి భారతదేశం సుముఖత వ్యక్తం చేసింది.శీతాకాలంతోపాటు ఆర్థిక సంక్షోభం అఫ్ఘానిస్థాన్‌ను కుంగదీస్తున్నందున, ఆహార కొరత ఏర్పడింది. 

చైనా, టర్కీ వంటి కొన్ని దేశాలు గత కొన్ని వారాలుగా అఫ్ఘాన్లకు ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభించాయి.50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను అఫ్ఘానిస్థాన్‌కు తరలించేలా పాకిస్థాన్ మీదుగా 5,000 ట్రక్కులను పంపాల్సి ఉంటుందని ఢిల్లీ అధికారులు చెప్పారు.భారతీయ ట్రక్కులను అనుమతించాల్సి ఉంటుందని, లేదంటే వాఘా-అట్టారీ సరిహద్దులోని జీరో పాయింట్ వద్ద గోధుమలను అన్‌లోడ్ చేసి మళ్లీ పాకిస్థాన్ ట్రక్కుల్లోకి ఎక్కించాల్సి ఉంటుందని లాజిస్టిక్స్ సూచిస్తున్నాయి.భారత్ అభ్యర్థనకు రావల్పిండి నుంచి ప్రతిస్పందన రాలేదు. భారత్ సహాయాన్ని స్వీకరించడానికి తాలిబాన్ సర్కారు సుముఖత వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement