ఇక భారత్‌లో ఎక్కడికైనా స్వేఛ్చగా వెళ్లొస్తా.. సంబరాన్ని అణుచుకోలేని పాకిస్థానీ మహిళ వ్యాఖ్య.. 32 ఏళ్ల తరువాత నెరవేరిన కల..

ABN , First Publish Date - 2022-01-01T01:55:56+05:30 IST

ఓ వ్యక్తి పరాయి దేశం పౌరసత్వం పొందాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు! ఇక ప్రత్యర్థి దేశానికి చెందిన వ్యక్తులకు పౌరసత్వం(సిటిజన్‌షిప్) ఇవ్వాలంటే ప్రభుత్వాలు మరింత తాత్సారం చేస్తాయి.

ఇక భారత్‌లో ఎక్కడికైనా స్వేఛ్చగా వెళ్లొస్తా.. సంబరాన్ని అణుచుకోలేని పాకిస్థానీ మహిళ వ్యాఖ్య.. 32 ఏళ్ల తరువాత నెరవేరిన కల..

ఇంటర్నెట్ డెస్క్:  ఓ వ్యక్తి పరాయి దేశం పౌరసత్వం పొందాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు! ఇక ప్రత్యర్థి దేశానికి చెందిన వ్యక్తులకు పౌరసత్వం(సిటిజన్‌షిప్) ఇవ్వాలంటే ప్రభుత్వాలు మరింత తాత్సారం చేస్తాయి. సిటిజన్‌షిప్ కోరుతున్న వ్యక్తి సామాజిక స్థితిగతులు, ఆ కోరిక వెనుకున్న ఇతర కారణాలు.. ఇలా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే ప్రభుత్వాలు ముందుకు కదులుతాయి. ఈ క్రమంలో అనేక మంది కొన్ని దశాబ్దాల పాటు పౌరసత్వం కోసం ఎదురుచూస్తారు. పాకిస్థాన్‌కు చెందిన ఖైరున్నీసా విషయంలో ఇదే జరిగింది. భారత పౌరసత్వం కోసం ఆమె ఏకంగా 32 ఏళ్ల పాటు నిరీక్షించింది. ఇటీవలే ప్రభుత్వం ఆమెను భారత పౌరురాలిగా గుర్తించింది. ఇన్నాళ్ల తన నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడటంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన ఖైరున్నీసా.. ‘‘ఇక భారత్ అంతా స్వేచ్ఛగా పర్యటిస్తా’’ అంటూ మీడియా వారితో వ్యాఖ్యానించింది. 


1987తో ఖైరున్నీసాకు భారత్‌కు చెందిన బుర్హానుద్దీన్‌తో వివాహమైంది. అతడి స్వస్థలం.. రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా. అయితే.. పెళ్లయ్యాకు కూడా ఖైరున్నీసాకు భారత పౌరసత్వం రాలేదు. ఈ కారణంగా సుదీర్ఘ వీసాపై ఆమె భారత్‌లో నివసించసాగింది. జిల్లా దాటి వెళ్లాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి కావడంతో ఆమె దాదపుగా ఝలావర్ జిల్లాకే పరిమితమైంది. ఇలా ఆమె దాదాపు 32 ఏళ్లు ఝలావర్ జిల్లాలోనే గడిపేసింది. 2012లో పౌరసత్వానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో తాము అప్లై చేసుకున్నామని ఖైరున్నీసా భర్త బుర్హానుద్దీన్ తెలిపాడు. ఇన్నాళ్లకు తమ ఎదురు ఎదురు చూపులకు తెర పడిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు.   

Updated Date - 2022-01-01T01:55:56+05:30 IST