పాకిస్తాన్ రెండో గెలుపు.. కివీస్ చిత్తు

ABN , First Publish Date - 2021-10-27T04:55:43+05:30 IST

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ అదరగొడుతోంది. మొదటి మ్యాచ్‌లో టీమిండియాపై చారిత్రక విజయం దక్కించుకున్న పాక్.. రెండో మ్యాచ్‌లో..

పాకిస్తాన్ రెండో గెలుపు.. కివీస్ చిత్తు

షార్జా: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ అదరగొడుతోంది. మొదటి మ్యాచ్‌లో టీమిండియాపై చారిత్రక విజయం దక్కించుకున్న పాక్.. రెండో మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ను చిత్తుగా ఓడింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. కివీస్ బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కివీస్ ఆటగాళ్లలో ఓపెనర్ డారిల్ మిచెల్(27: 20 బంతుల్లోల, 1 ఫోర్, 2 సిక్స్‌లు), కెప్టెన్ విలియమ్సన్(25: 26 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్), డెవోన్ కాన్వే(27: 24 బంతుల్లో, 3 ఫోర్లు,) మాత్రమే రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రవూఫ్ 4 వికెట్లతో అదరగొట్టగా.. షాహీన్ షా అఫ్రిదీ, ఇమాద్ వాసిమ్, మహ్మద్ హఫీజ్ తలా ఓ వికెట్ తీశారు. 


అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనింగ్‌లో శుభారంభం లభించలేదు. బాబర్ అజాం(9) వెంటనే అవుటయ్యాడు. అయినా మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(33: 34 బంతుల్లో, 5 ఫోర్లు) ఇన్నింగ్స్ నిలబెట్టాడు. మిడిలార్డర్‌లో షోయమ్ మాలిక్(26 నాటౌట్: 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు చివర్లో ఆసిఫ్ అలీ(27 నాటౌట్: 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) వేగంగా ఆడి మ్యాచ్ ముగించాడు. దీంతో పాకిస్తాన్ 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధీ 2 వికెట్లు తీయగా, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 4 వికెట్లతో రాణించిన హారిస్ రవూఫ్‌కు లభించింది.

Updated Date - 2021-10-27T04:55:43+05:30 IST