11ఏళ్ళ నిరీక్షణకు తెర.. పాక్ టెస్ట్ జట్టులో ఫవాద్‌కు స్థానం

ABN , First Publish Date - 2020-08-14T00:25:18+05:30 IST

పాకీస్తాన్ బ్యాట్స్‌మన్ ఫవాద్ ఆలమ్ 11ఏళ్ళ నిరీక్షణకు తెరపడింది. చివరిగా 2009లో న్యూజిల్యాండ్‌తో జరిగిన టెస్టులో ఫవాద్ పాల్గొన్నాడు. ఆ తరువాత టెస్టు జట్టుకు..

11ఏళ్ళ నిరీక్షణకు తెర.. పాక్ టెస్ట్ జట్టులో ఫవాద్‌కు స్థానం

ఇస్లామాబాద్: పాకీస్తాన్ బ్యాట్స్‌మన్ ఫవాద్ ఆలమ్ 11ఏళ్ళ నిరీక్షణకు తెరపడింది. చివరిగా 2009లో న్యూజిల్యాండ్‌తో జరిగిన టెస్టులో ఫవాద్ పాల్గొన్నాడు. ఆ తరువాత టెస్టు జట్టుకు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో తిరిగి తన స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు ఫవాద్ ఎంపికయ్యాడు. కానీ తొలి టెస్టులో స్థానం సంపాదించలేక పోయాడు. రెండో టెస్టులో మాత్రం అతడిని అదృష్టం వరించింది. షాదాబ్ ఖాన్ స్థానంలో ఫవాద్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు టీం మేనేజ్‌మెంట్ ప్రకటించింది. దీంతో సరిగ్గా 3,911 రోజుల తరువాత ఫవాద్ మళ్ళీ టెస్టు జర్సీ ధరించాడు. ఈ టెస్టులోనైనా సత్తా చాటి 34ఏళ్ళ వయసులో తన టెస్ట్ కెరీర్‌ను తిరిగి ప్రారంభించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇదిలా ఉంటే ఇన్నేళ్ళ కాలంలో ఫవాద్ పాక్ తరుపున 88 టెస్టు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.

Updated Date - 2020-08-14T00:25:18+05:30 IST