భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం : పాకిస్థాన్

ABN , First Publish Date - 2021-10-20T00:41:15+05:30 IST

పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించకుండా భారత జలాంతర్గామిని

భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం : పాకిస్థాన్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించకుండా భారత జలాంతర్గామిని తమ నావికా దళం అడ్డుకుందని పాకిస్థాన్ మిలిటరీ మంగళవారం పేర్కొంది. నావికా దళం గస్తీ విమానం అక్టోబరు 16న ఈ జలాంతర్గామిని గుర్తించి, అడ్డుకుందని ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో సముద్ర సరిహద్దుల రక్షణకు గట్టి నిఘా పెట్టినట్లు తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించినదంటూ ఓ వీడియో ఫుటేజ్‌ని కూడా విడుదల చేసింది.


భారత నావికా దళ జలాంతర్గామిని పాకిస్థాన్ నావికా దళానికి చెందిన లాంగ్ రేంజ్ మారిటైమ్ గస్తీ విమానం ముందుగా గుర్తించిన సంఘటనల్లో ఇది మూడోదని తెలిపింది.  2019 మార్చిలో ఇటువంటి సంఘటన జరిగిందని, తమ జలాల్లోకి ప్రవేశించబోతున్న భారత జలాంతర్గామిని గుర్తించి, నిరోధించినట్లు తెలిపింది. ఈ జలాంతర్గామిని తరిమికొట్టేందుకు తమ నావికా దళం ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిందని పేర్కొంది. 2016 నవంబరులో కూడా పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించకుండా భారత జలాంతర్గామిని నిరోధించినట్లు తెలిపింది.


Updated Date - 2021-10-20T00:41:15+05:30 IST