బాబర్ సత్తా నిరూపించుకుంటాడు: వసీం అక్రం

ABN , First Publish Date - 2020-08-05T02:58:00+05:30 IST

ఇంగ్లాండ్-పాకీస్తాన్ జట్ల మధ్య బుధవారం నుంచి టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పాక్ యువ బ్యాట్స్‌మన్ బాబర్ అజాంపైనే...

బాబర్ సత్తా నిరూపించుకుంటాడు: వసీం అక్రం

ఇస్లామాబాద్: ఇంగ్లాండ్-పాకీస్తాన్ జట్ల మధ్య బుధవారం నుంచి టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పాక్ యువ బ్యాట్స్‌మన్ బాబర్ అజాంపైనే ప్రస్తుతం పాక్ సీనిియర్ల దృష్టి నెలకొంది. టెస్టుల్లో బాబర్ గొప్పగా ఆడతాడని, తనేంటో ప్రపంచానికి తెలిసేలా చేస్తాడని పాకీస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ‘ఈ టెస్ట్ సిరీస్‌లో బాబర్ కచ్చితంగా సత్తా చాటుతాడు. తన ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా చేస్తాడు. పాక్ అతడిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాడు. ప్రస్తుతం పాక్ జట్టుకు అతడే వెన్నెముక. దీనివల్ల అతడిపై కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. దానిని అతడు తట్టుకోగలడ’ని అక్రమ్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం బాబర్ పాక్ వన్‌డే జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. టెస్టుల అనంతరం ఇంగ్లాండ్‌తో వన్‌డే మ్యాచ్‌లు కూడా ఆడాల్సిఉంది. ఇలాంటి తరుణంలో బాబర్ ఒకవేళ టెస్టుల్లో అంచనాలను అందుకోలేకపోతే ఆ ఒత్తిడి వన్‌డే‌లపై కూడా పడే అవకాశం ఉంది.

Updated Date - 2020-08-05T02:58:00+05:30 IST