సెహ్వాగ్ అలా అంటే గ్రౌండ్‌లోనే కొట్టేవాడిని: షోయబ్ అక్తర్

ABN , First Publish Date - 2020-08-03T01:37:29+05:30 IST

‘షోయబ్ అక్తర్ నన్ను అదేపనిగా స్లెడ్జింగ్ చేస్తున్నాడు. బౌన్సర్లు వేస్తూ హుక్ షాట్ కొట్టమని రెచ్చగొడుతున్నాడు. దాంతో విసిగిపోయిన నేను...

సెహ్వాగ్ అలా అంటే గ్రౌండ్‌లోనే కొట్టేవాడిని: షోయబ్ అక్తర్

ఇస్లామాబాద్: ‘షోయబ్ అక్తర్ నన్ను అదేపనిగా స్లెడ్జింగ్ చేస్తున్నాడు. బౌన్సర్లు వేస్తూ హుక్ షాట్ కొట్టమని రెచ్చగొడుతున్నాడు. దాంతో విసిగిపోయిన నేను నాన్‌స్ట్రైకర్ వైపు మీ బాబు నిలబడి ఉన్నాడు.. అతడికి చెప్పు అతడు కొట్టి చూపిస్తాడు.. నాన్‌స్ట్రైకర్‌లో సచిన్ ఉన్నాడు..’ పాక్-ఇండియా జట్ల మధ్య జరిగే స్లెడ్జింగ్‌ గురించి సెహ్వాగ్ చెప్పిన మాటలివి. అయితే సెహ్వాగ్ మాటలు ప్రపంచ దేశాలు మొత్తం మార్మోగుతున్నా షోయబ్ మాత్రం ఇన్నేళ్ల తర్వాత మేల్కొన్నట్లున్నాడు. ఇటీవల ఓ వీడియోలో అక్తర్ మాట్లాడాడు. ‘సెహ్వాగ్ ఒకవేళ నిజంగా ఆ మాట అని ఉంటే నేను వదిలిపెట్టేవాడినా..? కచ్చితంగా గ్రౌండ్‌లోనే చితకబాదేవాడిని. తర్వాత హోటల్‌లో కూడా కొట్టేవాడిని’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి దీనిపై మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Updated Date - 2020-08-03T01:37:29+05:30 IST