విరాట్ వర్సెస్ బాబర్‌పై మిస్బా ఉల్ హక్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2020-05-25T22:14:16+05:30 IST

ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాకిస్థాన్ యువ ఆటగాడు బాబర్ ఆజామ్‌ను అభిమానులు చాలాకాలంగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో

విరాట్ వర్సెస్ బాబర్‌పై మిస్బా ఉల్ హక్ ఏమన్నారంటే..

ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాకిస్థాన్ యువ ఆటగాడు బాబర్ ఆజామ్‌ను అభిమానులు చాలాకాలంగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చి చూస్తున్నారు. విరాట్ సాధించిన ఎన్నో ఘనతలని అతను కొద్ది రోజుల్లోనే సాధించాడని అంటున్నారు. తాజాగా ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధాన కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బా ఉల్ హక్ స్పందించారు. 


బాబర్ ఆజామ్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్‌ల స్థాయి చాలా దగ్గర్లో ఉన్నాడని ఆయన అన్నారు. ‘‘నాకు పోల్చడం ఇష్టం ఉండదు. కానీ, బాబర్.. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్‌ల స్థాయికి చాలా చేరువలో ఉన్నాడు. అతను వృత్తి ధర్మాన్ని పాటిస్తాడు. విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా అవ్వాలంటే.. తన ప్రతిభ, ఫిట్‌నెస్ మరియు ఆటపై అవగాహన ఉండటం ఎంతో అవసరం. బాబర్ ఎంతో గొప్ప ఆటగాడో మనందరికి తెలుసు. అంతేకాక.. ప్రపంచస్థాయి బాట్స్‌మెన్‌గా అతను ఓ ఉదాహరణగా నిలిచాడు’’ అని మిస్బా అన్నారు. 

Updated Date - 2020-05-25T22:14:16+05:30 IST