Abn logo
Jul 17 2021 @ 15:15PM

పాకిస్థాన్‌పై Sanjay raut ఫైర్

ముంబై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ సిద్ధాంతాలను తప్పుపట్టిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌పై శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శనివారంనాడు మండిపడ్డారు. తాలిబాన్ ఉగ్రవాద సంస్థను సృష్టించినదే పాకిస్థాన్ అని, ప్రపంచంలో ఉగ్రవాదానికి బాధ్యత కూడా వాళ్లదేనని అన్నారు. ఆప్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితికి కూడా పాకిస్థానే కారణమని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

''తాలిబాన్‌ను సృష్టించిందెవరు? అది పాకిస్థానే. తాలిబాన్ సహకారంతో పాకిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యాప్తి చేసింది. ఆయా దేశాలు ఉగ్రవాద బెడదను ఎదుర్కొంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను విశ్వసించాల్సిన పనే లేదు'' అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏమిటి? జమ్మూకశ్మీర్ అనేది భారతదేశంలోని అంతర్భాగం. అది నిజం. యావద్దేశ ప్రజల సెంటిమెంట్ కూడా అదేనని రౌత్ అన్నారు.

కాగా, ఆప్ఘనిస్థాన్‌లో తాలిబాన్ చర్యలపై పాకిస్థాన్ వైఖరి గురించి అడిగిన ప్రశ్నలకు ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం సమాధానం చెప్పకుండా ముఖం చాటేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంపై ప్రశ్నించినప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్‌ను తప్పుపట్టారు. ఇండియాతో చర్చల్లో ప్రతిష్ఠంభనకు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే కారణమని వ్యాఖ్యానించారు.