డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడుస్తున్న పాక్ : జమ్మూ కశ్మీర్ డీజీపీ

ABN , First Publish Date - 2020-09-19T21:11:22+05:30 IST

జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని జమ్మూ

డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడుస్తున్న పాక్ : జమ్మూ కశ్మీర్ డీజీపీ

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ మండిపడ్డారు. అన్ని ఉగ్రవాద సంస్థలకు తగిన సహాయం చేస్తూ అవసరం వచ్చిన ప్రతి పరిస్థితుల్లోనూ తీవ్రవాదాన్ని పెంచడానికే పాక్ యత్నిస్తోందన్నారు. ఉగ్రవాద నిధుల కోసం పాకిస్తాన్ నార్కో టెర్రరిజాన్ని ఉపయోగిస్తోందని, డ్రగ్ స్మగ్లర్ల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.


డ్రోన్ల ద్వారా జమ్మూ కశ్మీర్ లో పాకిస్తాన్ ఆయుధాలను జారవిడుస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో పాటు అక్రమ చొరబాట్లను కూడా పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని, ఎంత మాత్రమూ సహించమని ఆయన హెచ్చరించారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడవడం అన్న ప్రక్రియను ఆపేయడం సవాల్ తో కూడుకున్న పనేనని, అయినా వాటిని నిలువరించడంలో కొంత మేర విజయం సాధించామని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-19T21:11:22+05:30 IST