కష్టాల్లో పాక్.. కేవలం 2 జలాంతర్గాములతో నెట్టుకొస్తున్న వైనం!

ABN , First Publish Date - 2021-08-13T00:34:15+05:30 IST

దేశ రక్షణకు సరిపడా జలాంతర్గాములు అందుబాటులో లేక పాక్ నావికా దళం ప్రస్తుతం ఇబ్బందులు పడుతోంది.

కష్టాల్లో పాక్.. కేవలం 2 జలాంతర్గాములతో నెట్టుకొస్తున్న వైనం!

ఇస్లామాబాద్: దేశ రక్షణకు సరిపడా జలాంతర్గాములు అందుబాటులో లేక పాక్ నావికా దళం ప్రస్తుతం ఇబ్బందులు పడుతోంది. పాక్ వద్ద అగొస్టా క్లాస్‌కు చెందిన ఐదు సబ్‌మెరైన్లు ఉండగా.. వాటిలో మూడింటిని ఆధునికీకరణ కోసం, మరమ్మతుల కోసం హార్బర్‌కు పరిమితం చేయాల్సి వచ్చింది. దీంతో కేవలం రెండు సబ్‌మెరైన్లతోనే నేవీ నెట్టుకొస్తోంది. జలాంతర్గాములే కాకుండా ఇతర యుద్ధనౌకలకూ మరమ్మతులు అవసరమవడంతో పాక్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కుంటోందని సమాచారం. పాక్‌తో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది. భారత్ వద్ద ప్రస్తుతం మూడు కల్వరీ క్లాస్ సబ్‌మెరైన్లు, నాలుగు శిశుమార్ క్లాస్ సబ్‌మెరైన్లు, ఎనిమిది సింధుఘోష్ క్లాస్ సబ్‌మెరైన్లు ఉన్నాయి. వీటికి తోడు అరిహంత్ క్లాస్ అణుజలాంతర్గామి కూడా దేశరక్షణలో పాలు పంచుకుంటోంది. 

Updated Date - 2021-08-13T00:34:15+05:30 IST