Abn logo
Nov 21 2020 @ 18:33PM

కరోనా బారినపడిన పాక్ పేసర్ సోహైల్ తన్వీర్

Kaakateeya

కొలంబో: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)కు ముందు పాకిస్థాన్ పేసర్ సోహైల్ తన్వీర్ కరోనా బారినపడ్డాడు. ఎల్‌పీఎల్‌లో కేండీ టస్కర్స్‌కు తన్వీర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దురదృష్టవశాత్తు తన్వీర్‌ కొవిడ్ బారినపడ్డాడని, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు కేండీ టస్కర్స్ యాజమాన్యం ట్వీట్ చేసింది. ఈ జట్టులో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్లు ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్, స్థానిక ఆటగాడు కుశాల్ పెరీరా, శ్రీలంక టీ20 స్పెషలిస్టులు కుశాల్ మెండిస్, నువాన్ ప్రదీప్ వంటివారు ఉన్నారు.  


ఇర్ఫాన్ కంటే ముందు కెనడా బ్యాట్స్‌మన్ రవీందర్‌పాల్ సింగ్ కరోనా బారినపడ్డాడు. అతడు కొలంబో కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరోనా నుంచి కోలుకుంటేనే అతడిప్పుడు మైదానంలో అడుగుపెట్టగలుగుతాడు. క్రిస్‌గేల్, లసిత్ మలింగ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే వచ్చే వారం ఎల్‌పీఎల్ ప్రారంభం కాబోతోంది. ఎల్‌పీఎల్‌లో ఐదు జట్లు కొలంబో కింగ్స్, కేండీ టస్కర్స్, గాలే, దంబుల్లా, జాఫ్నా జట్లు తలపడనున్నాయి. మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 26న హంబన్‌తోటలోని మహింద రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కొలంబో, కేండీ జట్ల మధ్య మ్యాచ్‌తో ఎల్‌పీఎల్ ప్రారంభం కానుంది. 

Advertisement
Advertisement