హిందూ ఆలయ నిర్మాణ పనులు ఆపేసిన పాకిస్థాన్

ABN , First Publish Date - 2020-07-06T03:27:55+05:30 IST

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తలపెట్టిన తొలి హిందూ ఆలయ నిర్మాణ పనులు ముందుకు

హిందూ ఆలయ నిర్మాణ పనులు ఆపేసిన పాకిస్థాన్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తలపెట్టిన తొలి హిందూ ఆలయ నిర్మాణ పనులు ముందుకు సాగేలా కనిపించడం లేదు. కొందరు సంప్రదాయవాదుల బృందం వారాంతంలో ఆలయ ప్రహరీని ధ్వంసం చేయడంతో నిర్మాణ పనులు నిలిపివేయాల్సిందిగా రాజధాని అభివృద్ధి అథారిటీ (సీడీఏ) ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ప్రహరీని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

 

ప్రహరీ ధ్వంసమైన తర్వాత ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అధికారులు నిర్మాణాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను అధికారులకు సమర్పించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సీడీఏ అధికార ప్రతినిధి మజర్ హుస్సేన్ తెలిపారు. రాజధానిలో ఎలాంటి నిర్మాణమైనా భవన నిర్మాణ ప్లాన్ ఆమోదం తప్పనిసరన్నారు. సీడీఏ ఆదేశాలతో నిర్మాణ పనులు నిలిపివేసిన హిందూ పంచాయత్ సోమవారం (జులై 6న) సీడీఏ కార్యాలయానికి వెళ్లి ఈ విషయమై చర్చించాలని నిర్ణయించింది. 


Updated Date - 2020-07-06T03:27:55+05:30 IST