కెమికల్ కాస్ట్రేషన్ నిబంధన తొలగింపు : పాకిస్థాన్

ABN , First Publish Date - 2021-11-20T00:57:29+05:30 IST

సీరియల్ రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష

కెమికల్ కాస్ట్రేషన్ నిబంధన తొలగింపు : పాకిస్థాన్

ఇస్లామాబాద్ : సీరియల్ రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష విధించేందుకు అవకాశం కల్పించే నిబంధనను నూతన యాంటీ రేప్ క్రిమినల్ లా సవరణ చట్టం నుంచి తొలగించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. పార్లమెంటు సంయుక్త సమావేశంలో బుధవారం హడావిడిగా ఆమోదించిన దాదాపు 35 బిల్లుల్లో ఈ బిల్లు కూడా ఉన్న సంగతి తెలిసిందే.  


న్యాయ శాఖకు చెందిన పార్లమెంటరీ కార్యదర్శి మలీకా బుఖారీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, సీరియల్ రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష విధించేందుకు అవకాశం కల్పించే నిబంధనను నూతన యాంటీ రేప్ క్రిమినల్ లా సవరణ చట్టం నుంచి తొలగించినట్లు తెలిపారు. పాకిస్థాన్‌లోని చట్టాలను ఇస్లాం దృక్పథంతో పరిశీలించి, వివరించే ఇస్లామిక్ ఐడియాలజీ కౌన్సిల్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కెమికల్ కాస్ట్రేషన్ ఇస్లామ్‌కు వ్యతిరేకమని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ కౌన్సిల్ చెప్పిందన్నారు. 


పోలండ్, దక్షిణ కొరియా, చెక్ రిపబ్లిక్, కొన్ని అమెరికన్ రాష్ట్రాల్లో రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష విధించేందుకు ఆయా దేశాల చట్టాలు అనుమతిస్తున్నాయి. 


Updated Date - 2021-11-20T00:57:29+05:30 IST