Abn logo
Feb 27 2021 @ 07:09AM

పాకిస్థాన్‌లో తాలిబాన్ కమాండర్ హతం

సౌత్ వజిరిస్థాన్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో తాలిబాన్ కమాండర్ హతమయ్యాడు. సౌత్ వజిరిస్థాన్ పట్టణంలోని షార్ వంగీ టిజ్రా ప్రాంతంలోని ఉగ్రవాదుల రహస్య శిబిరంలో జరిగిన ఎదురుకాల్పుల్లో తెహ్రీక్ ఐ తాలిబాన్ పాకిస్థాన్ సంస్థకు చెందిన నూరిస్థాన్ అలియాస్ హసన్ బాబా హతమయ్యాడు. 2007 నుంచి 50 మంది భద్రతా సిబ్బందిని హతమార్చిన కేసుల్లో నిందితుడైన కరడుకట్టిన ఉగ్రవాది హసన్ బాబా ఎట్టకేలకు భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు. ఐఈడీ నిపుణుడు, వాంటెడ్ టెర్రరిస్టు అయిన హసన్ బాబా పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు.అప్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేర పాక్ భద్రతా బలగాలు దాడి చేశాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపగా, పాక్ భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తాలిబాన్ కు చెందిన కరడుకట్టిన ఉగ్రవాది హసన్ బాబా హతమయ్యాడు.


Advertisement
Advertisement
Advertisement