Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 28 2021 @ 21:30PM

ఈ జిహాద్‌ తప్పు: పట్టుబడిన పాక్ ఉగ్రవాది అలీ బాబర్

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తుండగా భారత సైన్యం అలీ బాబర్ అనే పాక్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ పంజాబ్‌‌లోని ఒకారా దిపాల్‌పుర్‌కు చెందిన అలీ బాబర్ వయసు 19 సంవత్సరాలు. లష్కర్ ఎ తొయిబాకు చెందిన అలీ బాబర్ విచారణలో అనేక కీలక విషయాలు వెల్లడించాడు. లష్కర్ ఎ తొయిబాకు చెందిన గర్హీ హబీబుల్లా క్యాంప్‌లో 2019లో మూడు వారాల శిక్షణ తర్వాత తనకు 20 వేల రూపాయలిచ్చి ఐఎస్ఐకి అప్పగించారని చెప్పాడు. ఆ తర్వాత పాక్ ఆర్మీ తమకు శిక్షణ ఇచ్చిందని చెప్పాడు. కశ్మీర్‌లోకి చొరబడితే తన కుటుంబానికి 30 వేల రూపాయలు ఇస్తామని తనకు మాటిచ్చారని చెప్పాడు.


తండ్రి చనిపోయి తన కుటుంబం పేదరికంలో మగ్గిపోతున్న సమయంలో పాఠశాల చదువు మానేసి లష్కర్ ఎ తొయిబాలో చేరానని అలీ బాబర్ చెప్పాడు. తన తల్లి, సోదరి దిపాల్‌పూర్‌లో ఉంటున్నారని తెలిపాడు. తనతో పాటు మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు పాక్ ఆర్మీకి చెందిన జాబ్రి పోస్ట్ నుంచి నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించామన్నాడు. పాక్ చేయిస్తున్న జిహాద్ తప్పుడుదని పాక్ యువతకు చెప్పాలనుందని అలీ బాబర్ తెలిపాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement