చైనాకు బహుమతిగా 2 ద్వీపాలను పాక్ ఇవ్వబోతోందా?

ABN , First Publish Date - 2020-10-25T18:59:25+05:30 IST

ఇస్లామాబాద్ : ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం ఏక పక్షంగా రెండు ద్వీపాలను చైనాకు బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సింధ్ ప్రజలతో కానీ, ఆ ప్రభుత్వంతో కానీ సంప్రదించకుండానే ఆ ప్రావిన్స్‌లోని బుద్ధూ, బుందాల్ ద్వీపాలను చైనాకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల కోసం వీటిని చైనాకు ఇస్తున్నట్లు పైకి చెప్పుకుంటున్నప్పటికీ, అరేబియా సముద్రంలో పట్టు సాధించాలని చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి. సింధ్, బలూచిస్థాన్ తీరాల్లో ద్వీపాల అభివృద్ధి గురించి ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది చైనాలో పర్యటించినపుడు మాట్లాడినట్లు సమాచారం. ఈ ప్రాంతంపై పట్టు సాధించాలన్న కసితో ఉన్న చైనా వెంటనే ఇమ్రాన్ ఆకాంక్షలకు మద్దతు పలికిందని చెప్తున్నారు. ఈ ద్వీపాలను సొంతం చేసుకుంటే, సైనికపరంగా ప్రయోజనాలు ఉంటాయని చైనా భావిస్తోంది. కనీసం 8 ద్వీపాలను అభివృద్ధి చేయడంపై అధ్యయనం నిర్వహించడానికి చైనా అంగీకరించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి రెండు ద్వీపాలపై చైనా కన్ను పడినట్లు తెలుస్తోంది. చైనీస్ ఇంజినీర్లు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ పరిణా

చైనాకు బహుమతిగా 2 ద్వీపాలను పాక్ ఇవ్వబోతోందా?

ఇస్లామాబాద్ : ఇస్లామాబాద్ : ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం ఏక పక్షంగా రెండు ద్వీపాలను చైనాకు బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సింధ్ ప్రజలతో కానీ, ఆ ప్రభుత్వంతో కానీ సంప్రదించకుండానే ఆ ప్రావిన్స్‌లోని బుద్ధూ, బుందాల్ ద్వీపాలను చైనాకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల కోసం వీటిని చైనాకు ఇస్తున్నట్లు పైకి చెప్పుకుంటున్నప్పటికీ, అరేబియా సముద్రంలో పట్టు సాధించాలని చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి. 

సింధ్, బలూచిస్థాన్ తీరాల్లో ద్వీపాల అభివృద్ధి గురించి ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది చైనాలో పర్యటించినపుడు మాట్లాడినట్లు సమాచారం. ఈ ప్రాంతంపై పట్టు సాధించాలన్న కసితో ఉన్న చైనా వెంటనే ఇమ్రాన్ ఆకాంక్షలకు మద్దతు పలికిందని చెప్తున్నారు. ఈ ద్వీపాలను సొంతం చేసుకుంటే, సైనికపరంగా ప్రయోజనాలు ఉంటాయని చైనా భావిస్తోంది. కనీసం 8 ద్వీపాలను అభివృద్ధి చేయడంపై అధ్యయనం నిర్వహించడానికి చైనా అంగీకరించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి రెండు ద్వీపాలపై చైనా కన్ను పడినట్లు తెలుస్తోంది. చైనీస్ ఇంజినీర్లు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. 

ఈ పరిణామాల గురించి తెలిసిన వర్గాలు జాతీయ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం కరాచీ, గదర్ పోర్టులలో పనులు జరుగుతున్నాయని, ఆ పనులు ప్రస్తుత వేగంతో కొనసాగితే, రాబోయే మూడు, నాలుగేళ్ళలో అరేబియా సముద్రంలో చైనీస్ జలాంతర్గామి స్థావరాలు ఏర్పాటుకావడం తథ్యమని పేర్కొన్నాయి. కరాచీ, గదర్ పోర్టులకు అనుబంధంగా బుద్ధూ, బుందాల్ ద్వీపాలు నిలవబోతున్నట్లు తెలిపాయి. 

చైనాకు బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సింధ్ ప్రజలతో కానీ, ఆ ప్రభుత్వంతో కానీ సంప్రదించకుండానే ఆ ప్రావిన్స్‌లోని బుద్ధూ, బుందాల్ ద్వీపాలను చైనాకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల కోసం వీటిని చైనాకు ఇస్తున్నట్లు పైకి చెప్పుకుంటున్నప్పటికీ, అరేబియా సముద్రంలో పట్టు సాధించాలని చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి. 

సింధ్, బలూచిస్థాన్ తీరాల్లో ద్వీపాల అభివృద్ధి గురించి ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది చైనాలో పర్యటించినపుడు మాట్లాడినట్లు సమాచారం. ఈ ప్రాంతంపై పట్టు సాధించాలన్న కసితో ఉన్న చైనా వెంటనే ఇమ్రాన్ ఆకాంక్షలకు మద్దతు పలికిందని చెప్తున్నారు. ఈ ద్వీపాలను సొంతం చేసుకుంటే, సైనికపరంగా ప్రయోజనాలు ఉంటాయని చైనా భావిస్తోంది. కనీసం 8 ద్వీపాలను అభివృద్ధి చేయడంపై అధ్యయనం నిర్వహించడానికి చైనా అంగీకరించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి రెండు ద్వీపాలపై చైనా కన్ను పడినట్లు తెలుస్తోంది. చైనీస్ ఇంజినీర్లు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. 

ఈ పరిణామాల గురించి తెలిసిన వర్గాలు జాతీయ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం కరాచీ, గదర్ పోర్టులలో పనులు జరుగుతున్నాయని, ఆ పనులు ప్రస్తుత వేగంతో కొనసాగితే, రాబోయే మూడు, నాలుగేళ్ళలో అరేబియా సముద్రంలో చైనీస్ జలాంతర్గామి స్థావరాలు ఏర్పాటుకావడం తథ్యమని పేర్కొన్నాయి. కరాచీ, గదర్ పోర్టులకు అనుబంధంగా బుద్ధూ, బుందాల్ ద్వీపాలు నిలవబోతున్నట్లు తెలిపాయి. 

Updated Date - 2020-10-25T18:59:25+05:30 IST