Advertisement
Advertisement
Abn logo
Advertisement

Pakistan: ఇంగ్లండ్ టూర్ రద్దు చేసుకోవడంపై బాబర్ ఆజం ఆవేదన

ఇస్లామాబాద్: భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించడంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తుంటే ఇతరులు మాత్రం సింపుల్‌గా కాదనుకుంటున్నారని విచారం వ్యక్తం చేశాడు. ఈ ఎదురుదెబ్బల నుంచి బయటపడి నిలదొక్కుకోవడమే కాకుండా మరింతగా అభివృద్ధి చెందుతామని ఆజం ఓ ట్వీట్‌లో ఆశాభావం వ్యక్తం చేశాడు.


పాకిస్థాన్‌లో వైట్‌బాల్ సిరీస్ ఆడేందుకు వచ్చిన న్యూజిలాండ్ తొలి వన్డేకు ముందు భద్రతా కారణాలతో సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయింది. ఇప్పుడే అదే కారణాలతో ఇంగ్లండ్ జట్టు కూడా సిరీస్‌ను రద్దు చేసుకుంది. కివీస్ తన పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత బాబర్ మాట్లాడుతూ పాకిస్థాన్ నిఘా సంస్థలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. కాగా, ఈసీబీ నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Advertisement
Advertisement