పాక్‌దే వన్డే సిరీస్‌

ABN , First Publish Date - 2021-04-08T05:56:25+05:30 IST

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీ్‌సను పర్యాటక పాకిస్థాన్‌ 2-1తో కైవసం చేసుకొంది. ఫఖర్‌ జమాన్‌ (101) సెంచరీతో చెలరేగడంతో ఆఖరి, మూడో వన్డేలో పాక్‌ 28 పరుగులతో గెలుపొందింది...

పాక్‌దే వన్డే సిరీస్‌

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీ్‌సను పర్యాటక పాకిస్థాన్‌ 2-1తో కైవసం చేసుకొంది. ఫఖర్‌ జమాన్‌ (101) సెంచరీతో చెలరేగడంతో ఆఖరి, మూడో వన్డేలో పాక్‌ 28 పరుగులతో గెలుపొందింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఫఖర్‌ జమాన్‌ శతకంతో పాటు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (94), ఇమాముల్‌ హక్‌ (57) అర్ధ సెంచరీలతో రాణించడంతో పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు సాధించింది. ఛేదనలో సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటై ఓడింది. మలాన్‌ (70) టాప్‌ స్కోరర్‌. షహిన్‌ షా, నవాజ్‌ చెరి 3 వికెట్లు తీశారు. 

Updated Date - 2021-04-08T05:56:25+05:30 IST