Advertisement
Advertisement
Abn logo
Advertisement

న్యూజిలాండ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్

షార్జా: న్యూజిలాండ్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్‌పై అద్భుత విజయం సాధించిన పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ద్వారా గ్రూప్ 2లో అగ్రస్థానానికి ఎగబాకాలని చూస్తోంది. న్యూజిలాండ్‌కు మాత్రం ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 ప్రపంచకప్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులను భయపెట్టేలా ఉన్న పాకిస్థాన్‌ను.. విలియమ్సన్ సేన ఏ మేరకు ఎదురొడ్డుతుందో చూడాల్సిందే. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement