సచిన్‌ను మొదటి సారి చూసినప్పుడు అలా అనుకున్నా..: పాక్ మాజీ క్రికెటర్

ABN , First Publish Date - 2020-07-04T21:51:33+05:30 IST

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌పై పాక్ మాజీ క్రికెటర్ వకార్ యోనిస్ ప్రశంశల వర్షం కురిపించాడు. మొదటి సారి సచిన్‌ను...

సచిన్‌ను మొదటి సారి చూసినప్పుడు అలా అనుకున్నా..: పాక్ మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌పై పాక్ మాజీ క్రికెటర్ వకార్ యోనిస్ ప్రశంశల వర్షం కురిపించాడు. మొదటి సారి సచిన్‌ను చూసినప్పుడు పెద్ద ఆటగాడిలా అనిపించలేదని, అయితే ఇప్పుడు భారత్‌లో సచిన్‌కు ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదని యోనిస్ చెప్పొకొచ్చాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వకార్ సచిన్‌ గురించి అనేక విషయాలను పంచుకున్నాడు. తాను, సచిన్ ఒకేసారి 1989లో టెస్టు అరంగేట్ల్రం చేశామని, అయితే సచిన్ అప్పుడు ఓ స్కూల్ పిల్లాడిలా ఉండేవాడని అన్నాడు. ‘సచిన్‌ను మొదటిసారి చూసినప్పుడు గొప్ప ఆటగాడని అనుకోలేదు. కానీ దేశవాళీ మ్యాచ్‌లలో అతడి ఆటతీరు గురించి విన్నప్పుడు ఖంగు తిన్నా. నేనే కాదు జట్టంతా ఆశ్చర్యపోయింది. స్కూల్ పోటీల్లోనే అనేకసార్లు 300పై చిలుకు పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు సచిన్. స్కూల్ స్థాయిలో ఎవరైనా ట్రిపుల్ సెంచరీ చేస్తారా.. చెప్పండి.


ఆ స్థాయిలో సెంచరీ చేయడమే గొప్పగా చెప్పుకుంటారు. కానీ సచిన్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. దాంతో అతడిని ఎదుర్కొన్నప్పుడు గొప్ప ఆటగాడవుతాడని అనుకున్నాం. కానీ ఈ స్థాయిలో భారత క్రికెట్‌కు మూల స్థంభంగా నిలుస్తాడని మాత్రం అనుకోలేదు’ అంటూ సచిన్‌ను యోనిస్ ప్రశంశల్లో ముంచేశాడు. అంతేకాకుండా ఇన్నేళ్లలో సచిన్ ఎంతో సాధించాడని, అతడి కఠోర శ్రమ ఫలితమే ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టిందని వకార్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-07-04T21:51:33+05:30 IST