ఆకట్టుకుంటున్న పాక్ యువకుల ఫ్రెండ్‌షిప్ మీమ్!

ABN , First Publish Date - 2021-08-03T13:58:17+05:30 IST

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా...

ఆకట్టుకుంటున్న పాక్ యువకుల ఫ్రెండ్‌షిప్ మీమ్!

ఇస్లామాబాద్: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు వేడుకలు చేసుకున్నారు. అయితే పాకిస్తాన్‌లో దీనికి భిన్నమైన ఉదంతం చోటుచేసుకుంది. ఇప్పుడిది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ గమ్మత్తయిన విషయమేమంటే, ఐదేళ్ల క్రితం విడిపోయిన ఇద్దరు స్నేహితులు ఇప్పుడు తిరిగి స్నేహితులయ్యారు. వివరాల్లోకి వెళితే ముదాసిర్, ఆసిఫ్ ఒకప్పుడు మంచి స్నేహితులు. 2015లో వీరి స్నేహం బీటలువారింది. ఆ సమయంలో ఆసిఫ్ తాను ముదాసిర్‌తో స్నేహ బంధాన్ని తెంపేసుకున్నట్లు ప్రకటిస్తూ, ఒక పోస్టర్ రూపొందించారు. దీనిని ఫేస్‌బుక్ పోస్టులో ప్రకటించాడు. ఇప్పుడు తనకు కొత్తగా సల్మాన్‌తో స్నేహం ఏర్పడిందని తెలిపాడు. 


ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ముదాసిర్.. ఆసిఫ్ సోదరునికి ఫిర్యాదు చేశాడు. దీనిని తెలుసుకున్న ఆసిఫ్.... ముదాసిర్‌తో గొడవపడ్డాడు. ఈ వివాదం తరువాత ఇప్పుడు ముదాసిర్, సల్మాన్ ఇద్దరూ ఆసిఫ్‌కు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇప్పుడు ఆసిఫ్, ముదాసిర్ మధ్య పక్కా దోస్తీ కుదింది. తమ పాత స్నేహం గురించి ఆసిఫ్ మాట్లాడుతూ తాము తమ మధ్య స్నేహబంధం తెగిపోలేదన్నారు. స్నేహం చేయడం సులభమేనని, అయితే దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టమని తెలిపాడు. కాగా ఈ ఉదంతంపై రూపొందించిన మీమ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2021-08-03T13:58:17+05:30 IST