తోడేలు ముసుగుతో పాక్ యువకుడి సంచారం

ABN , First Publish Date - 2021-01-02T17:15:13+05:30 IST

కొత్తసంవత్సరం రోజు తోడేలు ముసుగు ధరించి ప్రజలను భయపెట్టిన పాకిస్థానీని పోలీసులు కటకటాల్లోకి పంపించిన ఘటన...

తోడేలు ముసుగుతో పాక్ యువకుడి సంచారం

న్యూఈయర్ వేడుకల్లో భయపెట్టిన పాకిస్థానీ అరెస్ట్

పెషావర్ (పాకిస్థాన్): కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఫేస్ మాస్కు ధరించడం సర్వసాధారణం...కాని కొత్తసంవత్సరం రోజు తోడేలు ముసుగు ధరించి ప్రజలను భయపెట్టిన పాకిస్థానీని పోలీసులు కటకటాల్లోకి పంపించిన ఘటన పాకిస్థాన్ దేశంలోని పెషావర్ నగరంలో వెలుగుచూసింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పెషావర్ నగరానికి చెందిన ఓ యువకుడు తోడేలు ముసుగు ధరించి వీధుల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులను చేశాడు. వేడుకల్లో తోడేలు కాస్ట్యూమ్ మాస్కు ధరించి చిలిపిపని చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.


 తోడేలు ముసుగు ధరించి పోలీసులతో కలిసి నిలబడిన యువకుడి ఫొటోను పాక్ జర్నలిస్టు ఒకరు ట్విట్టరులో పోస్టు చేశారు. దీంతో ఈ వింత ఫొటో కాస్తా వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు తోడేలు ముసుగు ధరించి హాస్యాన్ని పండించిన యువకుడిని ప్రశంసించగా, మరికొందరు నూతన సంవత్సరం సందర్భంగా తాము ఆనందంగా గడిపితే, అతన్ని ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను ప్రశ్నించారు. ఇతన్ని ఫ్రీ తోడేలు బాలుడు అంటూ కొందరు నెటిజన్లు నామకరణం చేశారు.

Updated Date - 2021-01-02T17:15:13+05:30 IST