Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 12 2021 @ 11:28AM

జోధ్‌పూర్‌లో 97మంది Pakistani వలసదారులకు భారత పౌరసత్వం

జోధ్‌పూర్(రాజస్థాన్): పాక్ నుంచి వలస వచ్చిన వారికి భారత్ పౌరసత్వం ఇచ్చింది. తొంభై ఏడు మంది పాకిస్థాన్ మైనారిటీ వలసదారులకు గురువారం జోధ్‌పూర్ నగరంలో భారత పౌరసత్వం లభించింది. వారందరికీ జిల్లా సమాచార కేంద్రంలో జరిగిన శిబిరంలో జిల్లా యంత్రాంగం పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందించింది.తమ వద్ద మరో 35 సర్టిఫికేట్లు సిద్ధంగా ఉన్నాయని, వీటిని రాబోయే రెండు-మూడు రోజుల్లో జారీ చేస్తామని అధికారులు చెప్పారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పౌరసత్వం సమస్య  ఎట్టకేలకు పరిష్కారమైంది.

చాలా కాలంగా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న ఈ వలసదారులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాల జారీ ఉపశమనం కలిగించింది. పౌరసత్వ సర్టిఫికేట్‌ల కోసం అర్హత ఉన్న కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా మేజిస్ట్రేట్‌లకు పౌరసత్వ అధికారాలు అప్పగించినప్పటికీ గత నాలుగేళ్లలో 75 శాతం కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అర్హులైన వలసదారులందరికీ పౌరసత్వం లభించే వరకు శిబిరాలు ఏర్పాటు చేయాలని వలసదారులు కోరుతున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement