ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. పాక్ మహిళ ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే !

ABN , First Publish Date - 2020-12-05T15:46:29+05:30 IST

తన పేరుపై అమెరికాలో ఉన్న రెండు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను క్లైమ్ చేసుకోవడానికి పాక్ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది.

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. పాక్ మహిళ ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే !

కరాచీ: తన పేరుపై అమెరికాలో ఉన్న రెండు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను క్లైమ్ చేసుకోవడానికి పాక్ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. తనను తాను చనిపోయినట్లు తప్పడు ధృవ పత్రాలు సృష్టించి ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 11కోట్లు) క్లైమ్ చేసుకుంది. దీంతో ఈ మోసానికి పాల్పడిన సదరు మహిళ కోసం ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం... 2008, 2009లో అమెరికాకు వెళ్లిన సీమా ఖర్బే అనే మహిళ.. తన పేరున రెండు భారీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేసింది. అనంతరం 2011లో పాక్‌లోని స్థానిక అధికారులకు లంచం ఆశచూపి ఓ వైద్యుడి సహాయంతో ఫేక్ డేత్ సర్టిఫికేట్ పొందింది. 


ఇక సీమా చనిపోయినట్లు ధృవీకరించే ఆ పత్రాన్ని తీసుకుని ఆమె కుమారుడు, కూతురు అమెరికాకు వెళ్లి రూ. 11 కోట్ల పాలసీ డబ్బులు తీసుకున్నారని ఎఫ్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే, సీమా చనిపోయినట్లు ప్రకటించుకున్న తర్వాత ఆమె కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సమారు పదిసార్లు విదేశాలకు వెళ్లడం జరిగిందని.. కానీ ఏ ఒక్క విమానయాన సంస్థ కూడా ఆమె మోసాన్ని గ్రహించలేకపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఆమె ఐదు దేశాలను సందర్శించి.. ఐదుసార్లు కూడా ఎక్కడ దొరకకుండా సేఫ్‌గా స్వదేశానికి తిరిగి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ భారీ మోసానికి పాల్పడిన సీమాతో పాటు ఆమె కుమారుడు, కూతురు, ఆమెకు సహాకరించిన స్థానిక అధికారులు, వైద్యుడిపై ఎఫ్ఐఏ మానవ అక్రమ రవాణా విభాగం అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అమెరికన్ అధికారుల సమాచారంతో ఈ కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎఫ్ఐఏ వెల్లడించింది.      

Updated Date - 2020-12-05T15:46:29+05:30 IST