Jun 11 2021 @ 23:17PM

జూలై తొలి వారంలో...

గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. జూలై తొలి వారంలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ ‘‘టైటిల్‌కు తగ్గట్టు పక్కా కమర్షియల్‌ చిత్రమిది. మారుతి శైలిలో రూపొందుతోంది. శనివారం (జూన్‌ 12) గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా కొత్త స్టిల్‌ విడుదల చేశాం.


హీరో స్టైలిష్‌ లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. హీరో క్యారెక్టర్‌నూ మారుతి బాగా డిజైన్‌ చేశాడు. ఈ సినిమాలో సత్యరాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. మారుతితో మేం తీసిన ‘ప్రతిరోజూ పండగే’లో వాళ్లిద్దరూ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. జూలై తొలి వారంలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించి చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్‌.కె.ఎన్‌, సంగీతం: జేక్స్‌ బిజాయ్‌.