రైతు భరోసాతో ప్రచార ఆర్భాటాలే తప్ప...:ఎమ్మెల్యే రామానాయుడు

ABN , First Publish Date - 2020-05-30T16:36:26+05:30 IST

రైతు భరోసాతో ప్రచార ఆర్భాటాలే తప్ప...:ఎమ్మెల్యే రామానాయుడు

రైతు భరోసాతో ప్రచార ఆర్భాటాలే తప్ప...:ఎమ్మెల్యే రామానాయుడు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం శిరగాలపల్లిలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వరి పంటకు గిట్టుబాటు ధర లేదంటూ పంట పొలాల్లో  నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. వరి పంటను రైతులు దహనం చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ మానిఫెస్టోలో రూ.50వేలు ఇస్తామని,  నేడు రూ.30వేలు మాత్రమే ఇచ్చి జగన్ ప్రభుత్వం  మాట తప్పింది మడమ తిప్పిందని మండిపడ్డారు. రైతు ఋణామాఫీ 5వ వాయిదాను రద్దు చేసిన జగన్‌కు రైతు భరోసాపై మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. 70 శాతం ఉన్న కౌలు రైతులలో కేవలం 1శాతం కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తూ  జగన్ వారిని మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కులం పేరు చెప్పి కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడం దారుణమన్నారు. రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులు వేయడం కాదని.. రైతులకు ఉత్తమ సేవలు కావాలన్నారు. రైతు భరోసాతో ప్రచార ఆర్భాటం తప్ప రైతులకు ఒరిగేందిమిలేదని రామానాయుడు వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-05-30T16:36:26+05:30 IST