విజయమే లక్ష్యం: Ex cm

ABN , First Publish Date - 2021-11-27T15:37:52+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌, కార్పొరేషన్లకు జరుగ నున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలంతా పని చేయాలని, తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి,

విజయమే లక్ష్యం: Ex cm

- కార్పొరేషన్‌ ఎన్నికలకు అన్నాడీఎంకే వ్యూహం

- ప్రారంభమైన దరఖాస్తుల పంపిణీ 


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌, కార్పొరేషన్లకు జరుగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలంతా పని చేయాలని, తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి పిలుపునిచ్చారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌ సెల్వం, ఉప సమన్వయకర్త పళనిస్వామి, మాజీ మంత్రులు, పార్టీ జిల్లా కార్యదర్శుల వద్ద ఎన్నికల్లో పోటీచేయదలచుకున్న ఆశావాహులు దరఖాస్తులు సమర్పించాలని అన్నాడీఎంకే అధిష్ఠానం ఆదేశించింది. శుక్రవారం నుంచి ఈ నెల 29వ తేది వరకు దరఖాస్తులు వినియోగం, స్వీకరణ జరుగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగా సేలం జిల్లా ఓమలూరు లో ఉన్న అన్నాడీఎంకే జిల్లా కార్యాలయంలో పళనిస్వామి దరఖాస్తుల వినియోగాన్ని ప్రారంభించారు. అదే విధంగా, ఆత్తూర్‌ ప్రాంతంలో కూడా ఉదయం 10 గంటలకు దరఖాస్తుల వినియోగం మొదలైంది. కార్పొరేషన్‌ కౌన్సిలర్‌ పదవికి దరఖాస్తుతో రూ.5 వేలు, మున్సిపాలిటీ సభ్యుడికి రూ.2,500, టౌన్‌ పంచాయితీ సభ్యుడి పదవికి రూ.500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పళనిస్వామి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, సేలం జిల్లాలో ఒక కార్పొరేషన్‌, నాలుగు మున్సి పాలిటీలు, 31 నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయని, పార్టీ అభ్యర్ధులను మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎడప్పాడి పిలుపునిచ్చారు.

Updated Date - 2021-11-27T15:37:52+05:30 IST