పాలారు Bridgeపై రాకపోకలు నిషేధం

ABN , First Publish Date - 2021-11-23T16:14:23+05:30 IST

పాలారు నదిలో వరద ఉధృతి చూసేందుకు ప్రజలు వంతెన వద్దకు భారీగా తరలివస్తున్నారు. భద్రత దృష్ట్యా వంతెన వద్దకు ప్రజలు వెళ్లేందుకు పోలీసులు నిషేధం విధించారు. జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల

పాలారు Bridgeపై రాకపోకలు నిషేధం

వేలూరు(చెన్నై): పాలారు నదిలో వరద ఉధృతి చూసేందుకు ప్రజలు వంతెన వద్దకు భారీగా తరలివస్తున్నారు. భద్రత దృష్ట్యా వంతెన వద్దకు ప్రజలు వెళ్లేందుకు పోలీసులు నిషేధం విధించారు. జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కౌండన్య మహానది, అగరం నది, కాట్టూరుల్లో ప్రవహించే నీరు స్థానిక కొత్త బస్టాండు సమీపంలోని పాలారు నదిలో కలుసుకుంటాయి. 163 సంవత్సరాల తర్వాత పాలారు నదిలో వరదప్రవాహం ఏర్పడింది. దీంతో, పాలారు ఉధృతి చూసేందుకు రెండు రోజులుగా ప్రజలు భారీగా వంతెన వద్దకు చేరుకొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇలాంటి చర్యలతో ప్రమాదం జరిగే అవకాశముందని సీపీఎం మాజీ జిల్లా సెక్రటరీ నారాయణన్‌ జిల్లా కలెక్టర్‌ కుమరవేల్‌ పాండియన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌, వంతెనపై వెళ్లేందుకు ప్రజలకు నిషేధం విధించారు. దీంతో వంతెన ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటుచేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-11-23T16:14:23+05:30 IST