1న పాలీసెట్‌ పరీక్ష

ABN , First Publish Date - 2020-06-29T10:30:21+05:30 IST

జులై 1వతేదీన జరిగే పాలీసెట్‌ 2020కు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కేఎస్‌ఎస్‌ రత్నప్రసాద్‌

1న పాలీసెట్‌ పరీక్ష

ఖానాపురంహవేలి, జూన్‌28: జులై 1వతేదీన జరిగే పాలీసెట్‌ 2020కు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కేఎస్‌ఎస్‌ రత్నప్రసాద్‌ తెలిపారు. ఈపరీక్ష ఖమ్మంనగరంలో ఆరు సెంటర్లలో జరుగుతుందని తెలిపారు. ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌లో 1,2,3సెంటర్లు, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో 1, అదేప్రాంగణంలోని బాలికల జూనియర్‌ కళాశాలలో సెంటర్‌, కవితామెమోరియల్‌ డిగ్రీకళాశాలలో 1 సెంటర్లు ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1:30వరకు జరుగుతుందన్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని తెలిపారు. పాలీసెట్‌ అన్నీ సెంటర్లలో 2269మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.

Updated Date - 2020-06-29T10:30:21+05:30 IST