పల్లెపల్లెనా వ్యాక్సినేషన్‌ సందడి

ABN , First Publish Date - 2021-09-17T06:24:37+05:30 IST

కొవిడ్‌ మహమ్మారిని నియంత్రిచే మార్గంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంద శాతం పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం సన్నద్ధమ య్యింది. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి నేతృత్వంలో గురువారం జిల్లా వ్యాప్తంగా 102 శిబిరాల ద్వారా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేశారు.

పల్లెపల్లెనా వ్యాక్సినేషన్‌ సందడి
సిరిసిల్లలో వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రారంభిస్తున్న జడ్పీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్స్‌

- 102 గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు

సిరిసిల్ల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ మహమ్మారిని నియంత్రిచే మార్గంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంద శాతం పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం సన్నద్ధమ య్యింది. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి నేతృత్వంలో గురువారం జిల్లా వ్యాప్తంగా 102 శిబిరాల ద్వారా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేశారు. జిల్లాలో ఇప్పటివరకు 93.47 శాతం పూర్తికాగా మిగిలిన 7 శాతం పదిరోజుల్లో పూర్తిచేసే దిశగా వైద్య అరోగ్య శాఖతో పాటు జిల్లా పంచాయతీ శాఖ, అంగన్‌వాడీలు, ఆశావర్కర్‌లు, ఎంపీడీవోలు గ్రామ కార్యదర్శులు, ఇంటింటి సర్వేలు నిర్వహించి వ్యాక్సినేషన్‌కు అవగాహన కల్పించారు. జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌నకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చారు. గురువారం వ్యాక్సినేషన్‌ శిబిరాలను జడ్పీ  చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తదితరులు పర్యవేక్షించారు. వ్యాక్సినేషన్‌ పక్రియ పల్లెపల్లెనా సందడిగా మారింది. తొలి రోజు 12,887 మందికి టీకాలు వేశారు. ఇందులో మొదటి డోస్‌ 10,940 మందికి, రెండవ డోస్‌ 1,947 మందికి వేశారు. ఇందులో మొదటి డోసు 60 ఏళ్లకు పైబడినవారు 750 మంది, 18 నుంచి 44 ఏళ్ల వారు 7,893 మంది, 45 నుంచి 59 ఏళ్ల వారు 2,297 మంది ఉన్నారు. రెండో డోసులో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ 197 మంది, 60 ఏళ్లు దాటిన వారు 254 మంది, 18 నుంచి 44 ఏళ్ల వారు 683 మంది, 45 నుంచి 59 ఏళ్ల వారు 813 మంది ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,51,144 మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ఇందులో మొదటి డోసు 2,52,170 మంది, రెండో డోసు వేసుకున్నవారిలో 98,974 మంది ఉన్నారు. 


Updated Date - 2021-09-17T06:24:37+05:30 IST