Advertisement
Advertisement
Abn logo
Advertisement

వలసదారులకు Kuwait మరో ఝలక్.. ఆ విధానంలో వర్క్ పర్మిట్ల జారీకి స్వస్తి!

కువైత్ సిటీ: ఇప్పటికే వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కువైత్ తాజాగా మరో షాకిచ్చింది. కమర్షియల్ విజిట్ వీసాపై ఆ దేశానికి వెళ్లే ప్రవాసులకు ఆ వీసాలనే వర్క్ పర్మిట్లుగా మార్చే విధానాన్ని ఇప్పటివరకు అవలంభించిన విషయం తెలిసిందే. మహమ్మారి కరోనా కారణంగా ఏర్పడిన కార్మికుల కొరతను తీర్చేందుకు రెండు నెలల కింద కువైత్ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, తాజాగా ఈ విధానాన్ని స్వస్తి పలికినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) వెల్లడించింది. ఇకపై కమర్షియల్ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్లు/రెసిడెన్సీ పర్మిట్లుగా మార్చబోయేది లేదని స్పష్టం చేసింది. ఆటోమేటెడ్ సీస్టం ద్వారా నిర్వహించే ఈ పద్దతికి ముగింపు పలికినట్లు ప్రకటించింది. ఇవాళ్టి(నవంబర్ 24) నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఇక ఇప్పటికే అంతర్గత మంత్రిత్వశాఖ, ఆరోగ్యశాఖల ప్రత్యేక ఆదేశాలతో పీఏఎం కొంతమంది ప్రత్యేక కేటగిరీకి చెందిన ప్రవాసులకు మాత్రమే వర్క్ పర్మిట్లు ఇస్తోంది.

Advertisement
Advertisement